కోలుకోలేని స్థితిలో మొజ్తాబా: ట్రంప్
వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం త్వరలోనే ముగియనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ అధినేత మొజ్తాబా ఖామేనీ ప్రాణాలతోనే ఉన్నారని, అయితే ఆయన తీవ్రంగా గాయపడ్డారని, పూర్తిగా కోలుకోపోవచ్చని ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ వెల్లడించారు. మొజ్తాబా ఖామేనీ శరీరం ఎడమవైపు భాగం, చేయి, కాలు మొత్తం దెబ్బతిన్నాయని చెప్పారు. ఇరాన్ యంత్రాంగం నిర్ణయాల కోసం మొజ్తాబా ఖామేనీని సంప్రదిస్తుండటమే ఆయన జీవించి ఉండటానికి రుజువుగా ట్రంప్ అభిప్రాయపడ్డారు. అమెరికా సైనిక చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే ఇరాన్‌కు చెందిన 22 బోట్లు ధ్వంసం చేసినట్లు ట్రంప్ ప్రకటించారు. ‘మా నేవీ, సైన్యం అద్భుతంగా పనిచేస్తున్నాయి. యుద్ధంలో పెద్ద విజయం సాధించబోతున్నాం’ అని ఆయన చెప్పుకున్నారు. ఇరాన్ ప్రజలు వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు… ‘అలా చేస్తే కాల్చిపడేస్తారు. సైన్యం, స్నిఫర్లు సిద్ధంగా ఉంటారు కాబట్టే ఎవరూ ధైర్యం చేయరు’ అని ట్రంప్ అన్నారు. ఇరాన్ నావికాదళం, వాయుసేన పూర్తిగా నాశనమయ్యాయని, ఆ దేశం చాలా బలహీనపడిందని, త్వరలోనే యుద్ధం ముగియబోతోందని వెల్లడించారు. అణ్వాయుధం దక్కించుకోకుండా ఇరాన్‌ను నిరోధించడమే ప్రధాన లక్ష్యమన్నారు. 2015 నాటి అణు ఒప్పందం నుంచి వైదొలగాలన్న నిర్ణయాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు.
త్వరలో యుద్ధానికి తెర
- Advertisement -
RELATED ARTICLES


