విశాలాంధ్ర-తొర్రూరు: దాసరి మల్లయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు మరువలేనివని కాంగ్రెస్ పార్టీ పాలకుర్తి నియోజకవర్గం ఇన్చార్జి హనుమాండ్ల రaాన్సీ రవీందర్ రెడ్డి అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు దాసరి మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న రaాన్సీరెడ్డి శుక్రవారం సందర్శించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం దాసరి మల్లయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రaాన్సీరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి మల్లయ్య తొర్రూరు ఉప సర్పంచ్‌గా, డిసిసి ప్రధాన కార్యదర్శిగా, పిఎసిఎస్ వైస్ చైర్మన్, చైర్మన్‌గా, పిసిసి సభ్యులుగా సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి అనేకమంది యువకులను ప్రోత్సహించి రాజకీయ ప్రజాసేవలు అందించిన వ్యక్తి దాసరి మల్లయ్య అని కొనియాడారు. కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కాంగ్రెస్ నాయకులు మరువలేనని అన్నారు. తొర్రూరులో దాసరి మల్లయ్య విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, పెదగాని సోమయ్య, పెరటి యాకూబ్ రెడ్డి, అనుమాండ్ల దేవేందర్ రెడ్డి, దొంగరి శంకర్, బిక్షం గౌడ్, గంజి ప్రసాద్ రెడ్డి, కిషన్ యాదవ్, దేవేందర్ రెడ్డి, జలీల్, రమేష్ గౌడ్, అల్లం చిన్నకోటయ్య, కుమార్ యాదవ్, అనిత తదితరులు పాల్గొన్నారు.