- Advertisement -
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా పెరిగిన ముడిచమురు ధరలతో ప్రభుత్వరంగ చమురు కంపెనీలు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ధరలు పెరిగినా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉం డడం నష్టాలకు కారణమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రో లియం కార్పొరేషన్ లిమిటెడ్, హిం దుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ లీటరు పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.9 చొప్పున నష్టపోతు న్నాయని తెలిపింది. ఒక్కో ఎల్పీజీ సిలిండర్‌పై రూ.300 నష్టం వస్తోం దని ఇక్రా పేర్కొంది. ఈ లెక్కన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ రూ.530 కోట్లు నష్టాలు చవిచూస్తున్నాయని తెలిపింది.


