Monday, January 13, 2025
Homeఆంధ్రప్రదేశ్నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు..

నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు..

ముగ్గుల పోటీల్లో పాల్గొన్న మహిళలకు చంద్రబాబు కుటుంబం కానుకలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 126 మంది మహిళలు పాల్గొన్నారు. మహిళలు వేసిన రంగవల్లులను చంద్రబాబు, భువనేశ్వరి, బ్రహ్మణి, బాలకృష్ణ భార్య వసుంధర తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ… అందరికీ భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు సంక్రాంతి కానుకగా రూ. 10,116 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు. అందరికీ సుఖ సంతోషాలు కలగాలని ఆమె ఆకాంక్షించారు. మరోవైపు పిల్లలకు నిర్వహించిన వివిధ పోటీలను కూడా చంద్రబాబు దంపతులు తిలకించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు