Homeఅంతర్జాతీయంనార్వేలో లేబర్‌ పార్టీ విజయం

నార్వేలో లేబర్‌ పార్టీ విజయం

- Advertisement -

ఒస్లో: నార్వేలో ఎన్నికల్లో అధికార లేబర్‌ పార్టీ విజయం సాధించింది. 28.2 శాతం ఓట్లు, 57 పార్లమెంట్‌ సీట్లను సాధించింది. నాలుగు వామపక్ష పార్టీలు 21.1 శాతం ఓట్లు, 27 పార్లమెంట్‌ సీట్లను గెలుచుకున్నాయి. నార్వే పార్లమెంట్‌లో మొత్తం 169 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 85 సీట్లు అవసరం కాగా అధికార కూటమికి 87 సీట్లు వచ్చాయి. ప్రోగ్రెస్‌ పార్టీ 23.9 శాతం ఓట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కన్జర్వేటివ్‌ పార్టీ 14.6 శాతం ఓట్లతో మూడవ స్థానానికి దిగజారింది. కూటమికి గత ఎన్నికల కంటే సీట్లు, ఓట్లు తగ్గాయి. ఈసారి 78.9 శాతం పోలింగ్‌ జరిగింది. ఈనెల 8న పార్లమెంట్‌ ఎన్నికలు జరిగాయి. ఫలితాల అనంతరం నార్వే ప్రధాని, లేబర్‌ పార్టీ నాయకుడు జోనాస్‌ గహార్‌ స్టోయర్‌ మాట్లాడుతూ ‘మనం చేసి చూపాం… ఎన్నికల్లో విజయం సాధించాం’ అని ఆయన ఉద్ఘాటించారు. యూరప్‌తో మైత్రి వల్ల సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీల గెలుపు సాధ్యమైందన్నారు. అనిశ్చితి వేళ సవాళ్లను అధిగమించగలమని తమ గెలుపుతో నిరూపించామని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు