యుద్ధ నౌకను జాతికి అంకితమివ్వన్ను రాజ్‌నాథ్ సింగ్
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళం ఆరవ ప్రాజెక్ట్ 17ఏ స్వదేశీ స్టెల్త ఫ్రిగేట్ ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి (ఎఫ్38)ను యుద్ధ నౌకల డిజైన్ బ్యూరో రూపొందించింది. ముంబైలోని మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించిన ఈ నౌకను శనివారం విశాఖపట్నంలో అధికారికంగా ప్రారంభిస్తారు. ఇది 75 శాతానికి పైగా స్వదేశీ పరికరాలను, అధునాతన బహుళ-కార్యనిర్వహణ పోరాట సామర్థ్యాలను కలిగి ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్వర్యంలో షిప్ కమిషనింగ్ జరగనుంది. ఈ నౌకను జాతికి అంకితమిస్తారు. ఈ కార్యక్రమం కోసం రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు. ఆయనకు నౌకాదళ అధికారులు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ‘మహేంద్రగిరి’ స్వదేశీ ఆయుధాలు, సెన్సార్లు, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థల సముదాయంతో అమర్చబడి ఉంది. సముద్ర భద్రతా కార్యకలాపాలు, సెర్Ì అండ్ రెస్క్యూ మిషన్లు, మానవతా సహాయం, హిందూ మహాసముద్రం వెలుపల కార్యక్రమాలు నిర్వహించగలదు. తూర్పు కనుమలలోని మహేంద్రగిరి పర్వత శ్రేణి పేరుతో దీనికి నామకరణం జరిగింది. ‘మహేంద్రగిరి’ చేరికతో నావికాదళ యుద్ధ సామర్థ్యం మరింత బలోపేతమవుతుంది. శక్తివంతమైన-గంభీరమైన-సాటిలేని నినాదంతో ముందుకెళ్లే ‘మహేంద్రగిరి’ దేశానికి, నావికా దళానికి విశిష్ట సేవలందించేందుకు సిద్ధంగా ఉంది.


