Homeతెలంగాణపత్తికి మద్దతు ధర: తుమ్మల

పత్తికి మద్దతు ధర: తుమ్మల

- Advertisement -

విశాలాంధ్ర-హైదరాబాద్: రాష్ట్రంలో 2026-27 ఖరీఫ్ సీజన్‌కు పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి, రైతులకు కనీస మద్దతుధర అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం పత్తి సాగు, ఉత్పత్తి అంచనాలు, మార్కెట్ ధరలు, సీసీఐ కొనుగోళ్ల ఏర్పాట్లపై మంత్రి తుమ్మల సమీక్షించారు. రాష్ట్రంలో ఈ సీజన్‌లో 48.20 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా, 29.43 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేంద్రం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8,667 కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం మోడల్ మార్కెట్ ధర సుమారు రూ.9 వేలుగా ఉందన్నారు. మార్కెట్ ధరలు తగ్గినప్పుడు రైతులు సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించుకునేలా ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు. ఈ సీజన్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రాల సంఖ్యను 122 నుంచి 133కు పెంచగా, రాష్ట్రంలోని 30 జిల్లాల్లో 335 జిన్నింగ్ మిల్లులను కొనుగోలు కేంద్రాలుగా గుర్తించినట్లు అధికారులు వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పరీక్షలు, మౌలిక సదుపాయాలు, రవాణా, రైతులకు సకాలంలో చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పత్తి ధరల్లో వ్యత్యాసానికి గల కారణాలను పరిశీలించాలని, పత్తి ప్రాసెసింగ్, స్పిన్నింగ్, ఆయిల్ పరిశ్రమల విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. స్థానికంగా పరిశ్రమల సామర్థ్యం పెరిగితే రైతులకు మెరుగైన ధరలు లభించే అవకాశముందని పేర్కొన్నారు. పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం కపాస్ కిసాన్ యాప్, ఆన్‌లైన్ చెల్లింపులు, రైతుల వివరాల ధృవీకరణ ప్రక్రియను అమలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతుల సౌకర్యార్థం 1800-599-5779 టోల్‌ఫ్రీ నంబర్, 8897281111 వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కొనుగోలు కేంద్రాల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
భూసార పరిరక్షణతో ఆహార భద్రత
నేల సారాన్‌ని సంరక్షించుకుంటేనే భవిష్యత్ తరాలకు ఆహార భద్రత కల్పించగలమని మంత్రి తుమ్మల అన్నారు. రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన…కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఖేత్ బచావో అభియాన్’ను ప్రారంభించారు. భూసార పరిరక్షణ, సుస్థిర వ్యవసాయం, ప్రకృతి వనరుల సంరక్షణకు రైతులు ప్రాధాన్య మివ్వాలని సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావానికి అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవాలన్నారు. శాస్త్రవేత్తల సూచనల మేరకే రసాయన ఎరువులు, పురుగుమ ందులను వినియోగించాలని, ప్రతి రైతు భూసార పరీక్షలు చేయించుకుని వాటి ఫలితాల ఆధారంగా ఎరువులు వాడాలని సూచించారు. రైతులను సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహించాలని, పంట మార్పిడి, జీవ ఎరువులు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. నీటి పొదుపునకు…బిందు సేద్యం, వర్షపు నీటి సంరక్షణ, ఫామ్ పాండ్ల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. పంట వ్యర్థాలను కాల్చకుండా మల్చింగ్‌కు వినియోగించా లని, తద్వారా నేలలో తేమను కాపాడటంతో పాటు భూసారాన్‌ని పెంపొందించవచ్చన్నారు. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి, అర్హులైన రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ప్రభుత్వ పథకాల ద్వారా యంత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఖేత్ బచావో అభియాన్ను నిరంతర ఉద్యమంగా కొనసాగించాలని, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సమన్వయంతో పనిచేస్తూ గ్రామస్థాయిలో రైతులకు శాస్త్రీయ సలహాలు అందించాలని మంత్రి తుమ్మల సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు