Saturday, April 5, 2025
Homeవిశ్లేషణపునర్విభజన వద్దు… పరిమితి మేలు

పునర్విభజన వద్దు… పరిమితి మేలు

నంటూబెనర్జీ
ప్రపంచంలో అతి పెద్ద ఫెడరల్‌ (సమాఖ్య) ప్రజాస్వామ్య దేశం అమెరికా ప్రతినిధుల సభలో 1913 నుంచి ఇంతవరకు 435 సీట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అత్యధిక జనాభా గల భారతదేశ లోక్‌సభలోను, రాష్ట్రాల అసెంబ్లీలలో సీట్లు పెంచడం కోసం నియోజక వర్గాల పునర్విభజించడం అమెరికాతో పోలిస్తే ఏమాత్రం సమర్ధనీయమైంది కాదు. చాలా సంవత్సరాల తర్వాత దేశంలో జనాభా గణనను నిర్వహిస్తున్నారు. భారతదేశంలో జనాభా నియంత్రణ ఎంతైనా అవసరం. పెరుగుతున్న జనాభా విషయంలో ఆందోళన చెందాలి.
పాలకులు తమకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో ఎక్కువ సీట్లు ఉంటే ఎన్నికల్లో అధిక సీట్లు గెలుచుకొని మళ్లీ అధికారం చేపట్టాలన్న ఆరాటంతో నియోజక వర్గాల పునర్విభజన కోసం ప్రభుత్వం తహతహలాడుతోంది. ఓట్లు వేసి గెలిపించే ప్రజలకు మేలు చేకూర్చే పాలన అందివ్వడమే అవసరం. గత సంవత్సరం మన దేశ జనాభా చైనా జనాభాను మించిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ జనాభా మనది. భూమి విస్తీర్ణంలో భారతదేశం కంటే చైనా భూ విస్తీర్ణం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. ప్రజలంతా ఆర్థిక వృద్ధి ద్వారా ప్రయోజనం పొందడానికి, ప్రత్యేకించి విద్యా, వైద్య రంగాలలో వృద్ధి చెందడానికి జనాభా నియంత్రణపై దృష్టి పెట్టాలి. జనాభా నియంత్రణకే ప్రాధాన్యత నిచ్చి, పునర్విభజనను ప్రస్తుతానికి నిలిపి వేయాలి. అదనంగా సభ్యులు ఎన్నికై పని లేనట్లుగా సీట్లలో కూర్చుని ఉండటం కంటే తక్కువ మంది సభ్యులు ఉన్నప్పటికీ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లి శ్రద్ధగా చర్చల్లో పాల్గొనే అవకాశం కలుగుతుంది. సభ్యులు పెరిగినంత మాత్రం ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయన్న హామీ లేదని ప్రస్తుతం జరుగుతున్న పాలన స్పష్టం చేస్తోంది.
ప్రతి రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీలో నియోజక వర్గాలు, సరిహద్దులకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు కూడా సీట్లు ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్స్‌ 82, 170 ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీలో సీట్ల సంఖ్యను నిర్ణయిస్తారు. అయితే ప్రతిసారి జనాభా గణన అనంతరం సరిహద్దుల ప్రకారం లోక్‌సభ, అసెంబ్లీల్లో సీట్లను తిరిగి సర్దుబాటు చేయవచ్చు. లోక్‌సభ, అసెంబ్లీల్లో సీట్ల సంఖ్యను పెంచకుండా నిలిపివేయ డానికి చట్ట సవరణ ఎంతైనా అవసరం. చట్ట ప్రకారం పార్లమెంటు నియమించే ‘పునర్విభజన కమిషన్‌’ నివేదిక ప్రకారం ‘పునర్విభజన ప్రక్రియ’ జరిగింది. గతంలో 1951, 1961, 1971 సంవత్సరాల్లో పదేళ్లకు ఒకసారి ఈ ప్రక్రియ జరిగింది. అమెరికా ప్రతినిధుల సభలో 1913 నుంచి ఇంతవరకు సీట్ల సంఖ్య మారలేదు. జనాభా సంఖ్య 1913 లో 94 మిలియన్లుండగా మధ్య నాలుగు సార్లు మినహా అదీ స్వల్పంగా గత సంవత్సరం నాటికి 340 మిలియన్లకు పెరిగింది.
అమెరికాలో 1911లో అపోర్షన్‌మెంట్‌ (కేటాయింపు చట్టం) ద్వారా ప్రతినిధుల సభ సభ్యుల సంఖ్యను 435 తో కట్టడి చేసింది. 1959 లో హవేలి, అలస్క రాష్ట్రాలను తాత్కాలికంగా కలపగా సభ్యుల సంఖ్య 437కు పెరిగింది. 1910 లో జనాభా గణన తర్వాత జిల్లాల సంఖ్య మూడు రెట్ల కంటె ఎక్కువయ్యాయి. జిల్లాకు దాదాపు 2,12,000 జనాభా ఉన్నారు. ఫెడరల్‌ చట్టం గణాంకాల సూత్రాల ప్రకారం ఒక రాష్ట్రంలో ఎంతమంది సభ్యులుండాలని ప్రతినిధుల సభ నిర్ణయించింది. భారతదేశంలో పార్లమెంటు స్వభావాన్ని లేదా నాణ్యతను పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీల నాణ్యత కూడా పెరగవలసి ఉంది. చట్ట సభల్లో ఎక్కువ మంది సభ్యులను గెలిపించుకోవాలని రాజకీయ పార్టీలు ఆరాటపడతాయేగాని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చట్టాలను సమర్థంగా వినియోగించడంలో ఆసక్తి చూపవు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం సమర్థంగా సమస్యలు, చేయవలసిన పనులపై చర్చించాలి, అవసరమైతే సవరించుకోవాలి. అవసరాన్ని అనుసరించి కొత్త సమస్యలను చర్చించాలి. ఎన్నికల్లో గెలవగలరని గట్టిగా అనుకున్న సినీ నటులు, ఇతర విధంగా గెలుస్తారనుకున్న అభ్యర్థులను ఎంపిక చేసుకొని సీట్లను చేపట్టడం వలన ప్రయోజనం ఉండదు. భారతదేశంలో పరిస్థితి ఇప్పుడు ఇదే. ఇలాంటి సభ్యులు సభాకాలమంతా ఎలాంటి చర్చల్లో పాల్గొనకుండా సీట్లలో కూర్చుని కాలం గడిపే వారిని చూస్తూనే ఉంటాము. లోక్‌సభలో క్రియాశీలంగా చర్చల్లో పాల్గొనే సభ్యులు కనీసం 30 శాతం కూడా లేరు. కొంతమంది సభ్యులు కునుకుపడుతూ, కనీసం చర్చలను వినను కూడా వినరు. కొన్ని రాజకీయ పార్టీలు తమకు మెజారిటీ సభ్యులు కావాలని అన్ని రకాల కుయుక్తులు పన్ని తమ లక్ష్యం నెరవేర్చుకుం టారు. ఎక్కువ మంది సభ్యులను గెలిపించుకునేందుకు మాత్రమే తమ సమయాన్ని కేటాయించకుండా సభకు ఎక్కువ సమయం హాజరు కారు. పునర్విభజన ద్వారా చట్టసభలో సీట్లను పెంచుకోవడం ద్వారా ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసి తమ చిరకాల లక్ష్యం నెరవేర్చుకునేందుకే. ఇలాంటి చర్యలు నిలిచిపోవాలి. అయితే పాలకులు ఇలాంటి మంచి నియమ నిబంధనలు పాటించాలన్న చిత్తశుద్ధి ఉండాలి. తప్పుడు కార్యకలాపాలు నిర్వహించిన రాష్ట్రాలను శిక్షించాలి. జనాభా వృద్ధి విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి. జనాభా విపరీతంగా పెరిగితే మరింత ప్రమాదకర పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా పెరగడాన్ని ఏమాత్రం అంగీకరించరాదు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు పెరిగిన కొలదీ పాలనా ఖర్చులు అపారంగా పెరుగుతాయి. ఇప్పటికే సభ్యులకు అనేక రకాల ఖర్చులు ప్రజలకు అపార భారమయ్యాయి. ఉదాహరణకు ఒక ఎంపీకి సంవత్సరానికి ప్రభుత్వం 6 కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఇందులో వేతనాలు, పెర్క్‌లు, (ప్రభుత్వం నుంచి అదనంగా లభించే ఆదాయం) ఇతర ఖర్చులు, ఎంపీ లాడ్స్‌ (పార్లమెంటు సభ్యులు స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం) ఉంటాయి. గత సంవత్సరం ఎంపీకి 24 శాతం వేతనాన్ని పెంచారు. అయితే ఈ పెంపుదల 2023 ఏప్రిల్‌ నుంచే అమలైంది. గత ఐదు దశాబ్దాల కాలంలో భారత పార్లమెంటు (లోక్‌సభ) 543 మందితో పరిపాలన జరిగింది. 55 కోట్ల నుంచి ఇప్పటికీ 145 కోట్ల జనాభాకు చేరింది. రానున్న మూడు దశాబ్దాల్లో 165 కోట్ల నుంచి 170 కోట్లకు జనాభా పెరుగుతుందని అంచనా. అదే చైనా 2060 నాటికి 121 కోట్ల జనాభాకు చేరుకుంటుందని అంచనా. ఏ విధంగా చూసినప్పటికీ జనాభాను మరింత పెంచుకొని తద్వారా నియోజక వర్గాలను పెంచుకోవడం ఏమాత్రం మంచిది కాదని విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు