Wednesday, March 12, 2025
Homeతెలంగాణపేదలకు మేలు చేసేబడ్జెట్‌ కావాలి

పేదలకు మేలు చేసేబడ్జెట్‌ కావాలి

ప్రధాన సమస్యలను సభ దృష్టికి తీసుకొస్తా
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని

విశాలాంధ్ర బ్యూరో- కొత్తగూడెం:
ప్రజా ప్రభుత్వంగా మనుగడ సాధిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలుచేసే బడ్జెట్‌ను ప్రవేశపెడు తుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా అయన మాట్లాడుతూ ఆర్థికశాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు కొత్తగూడెం నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉందన్నారు. నియోజకవర్గానికి కావాల్సిన కేటాయింపులపై ఇప్పటికే తాను లేఖలు అందించానని వివరించారు. సాగు, తాగునీటి ప్రాజెక్టులు, సీతారామ ప్రాజెక్టు తోపాటు సింగరేణి Ûగనులు, కేటీపీఎస్‌ తదితర ప్రాజెక్టులకు ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నట్లు కూనంనేని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టాక పూర్తిగా పరిశీలించిన అనంతరం తన స్పష్టమైన అభిప్రాయాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తానని తెలిపారు. కేంద్రంలోని మోదీ సర్కారు బడ్జెట్‌లో పేదలు, సామాన్య ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించినట్లు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అలా కాకుండా ప్రాధాన్యత క్రమంలో అన్ని ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకొని విమర్శలకు తావు లేకుండా బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు