Homeవిశ్లేషణఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం

ఫాసిజానికి వ్యతిరేకంగా ఐక్య పోరాటం

- Advertisement -

డా॥ అరుణ్ మిత్ర

“ప్రజాస్వామ్యం” అనే పదం ప్రాచీన గ్రీకు పదం డెమోస్ అంటే ప్రజలు, క్రాటోస్ అంటే పాలన అనే పదాల నుంచి వచ్చింది. అంటే “ప్రజాపాలన” అని అర్థం. ప్రజాస్వామ్యంలో రాజకీయాధికారం చివరికి ప్రజలదే. ప్రతి పౌరుడికి ఓటు హక్కు, ఎన్నికల్లో పోటీ చేసే హక్కు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, ప్రజా వ్యవహారాల్లో పాల్గొనే హక్కు ఉంటాయి. ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే పౌరుల ప్రాథమిక హక్కులను, స్వేచ్చను రక్షించేది. భావ ప్రకటనా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు వంటి రాజ్యాంగ హక్కులను కాపాడాలి. ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. న్యాయ వ్యవస్థతో పాటు ఇతర రాజ్యాంగ సంస్థలు అధికార దుర్వినియోగాన్ని అడ్డుకునే స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేయాలి. అందువల్ల ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు చట్టబద్ధంగా, జవాబుదారీతనంతో, రాజ్యాంగబద్ధంగా పాలించడం.
బూర్జువా వ్యవస్థ : మార్కిస్స్ట్ సిద్ధాంతంలో, పెట్టుబడిదారీ విధానంలో ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థను వర్ణించడానికి ‘బూర్జువా ప్రజాస్వామ్యం’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. మార్కిస్స్ట్ ఆలోచనాపరుల ప్రకారం, ఇటువంటి వ్యవస్థలు సార్వత్రిక ఓటు హక్కు, ఎన్నికలలో పాల్గొనడం, వాక్ స్వాతంత్య్రం, సంఘ స్వేచ్ఛ వంటి హక్కులను కల్పించినప్పటికీ, ప్రధాన ఉత్పాదక రంగాలను ఈ పెట్టుబడిదారీ బూర్జువా వ్యవస్థ కనుసన్నల్లోనే ఉంటాయి. సంపద, మీడియాపై నియంత్రణ, లాబీయింగ్, ఆర్థిక వనరుల ఆధిపత్యం, రాజకీయ నిర్ణయ ప్రక్రియపై ప్రభావాన్ని చూపిస్తాయి. అందువల్ల బూర్జువా ప్రజాస్వామ్యం ప్రధానంగా ప్రైవేటు ఆస్తి, పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనాలను రక్షించే వ్యవస్థగా వారు విశ్లేషిస్తారు.
భారతదేశంలో ప్రజాస్వామ్య వికాసం : కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ప్రాచీన భారతదేశంలోని గణసంఘాలు, మహాజన పదాలు ప్రజాస్వామ్యానికి తొలి రూపాలుగా పేర్కొన్నారు. కాలక్రమేణా ఆధునిక రాజ్యాంగ ప్రజాస్వామ్యంగా రూపుదిద్దుకుంది. సంపన్న వర్గాలు ఆర్థిక వ్యవస్థపై ఆధిపత్యాన్ని, ప్రభుత్వ అధికారంతో తమ సంబంధాలను బలపరచుకుని ప్రజాస్వామ్య సంస్థలను బలహీనపరిచాయి. ఇటలీలో బెనిటో ముస్సోలినీ, జర్మనీలో అడాల్ÎÛ హిట్లర్ ఎదుగుదల, శక్తిమంతమైన ఆర్థిక ప్రయోజనాలు నిరంకుశ, ఫాసిస్ట్ పాలనలకు ఎలా మద్దతు ఇచ్చారో ప్రపంచానికి చూపించాయి. ఈ పొత్తు మానవాళిని విపత్తు వైపు నెట్టింది. ఈ పరిణామాలు చివరకు రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు.
భారత రాజ్యాంగం-ప్రజాస్వామ్యం లౌకికవాదం : మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ ప్రజల భాగస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య హక్కులను నిరంతరం చెప్పేవారు. రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ప్రధాన ఉత్పాదక రంగాలపై ప్రజాస్వామ్య నియంత్రణ అవసరమని, అప్పుడే ఆర్థిక ప్రజాస్వామ్యం సాధ్యమవుతుందని కమ్యూనిస్టు ఉద్యమకారులు, భగత్ సింగ్ వంటి విప్లవకారులు వాదించారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి, లౌకికవాదానికి సమాన ప్రాధాన్యతనిచ్చింది. దశాబ్దాల పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మారినా ప్రజాస్వామ్య వ్యవస్థ కొనసాగింది. కానీ, గత పన్నెండేళ్లుగా పధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆర్‌ఎస్‌ఎస్ భావజాల ప్రభావంతో నడుస్తున్న బీజేపీ ప్రభుత్వం హయాంలో, ప్రజాస్వామ్య సంస్థలు క్రమపద్ధతిలో క్ష్మీణించాయి.
ఈ ధోరణి యొక్క సైద్ధాంతిక మూలాలు ఆరెస్సెస్ రెండో సర్సంఘచాలక్ ఎం.ఎస్.గోల్వాల్కర్ రచనలు, ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ఆలోచనల్లో సంపద కొద్దిమంది పారిశ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకృతమవడం దేశ బలానికి అనుకూలమనే భావన కనిపిస్తుంది. అదే ధోరణి ప్రస్తుత ప్రభుత్వ విధానాల్లో కూడా కనిపిస్తోంది. జాతీయ ఆస్తులు పెద్ద కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లడం గమనించొచ్చు. అలాగే, ఆరెస్సెస్‌లోని కొందరు అడాల్ÎÛ హిట్లర్‌ను ప్రశంసిస్తూ, ఆయన విధానాలను జాతీయ సమైక్యతకు ఉదాహరణలుగా పేర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే కార్యకర్తలు, జర్నలిస్టులు, మేధావులు, ప్రతిపక్ష నాయకులపై “దేశద్రోహి” ముద్ర వేస్తున్నారు. దీనికారణంగా సుదీర్ఘకాలం న్యాయ విచారణలు, జైలు జీవితం ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రజాస్వామ్య స్వేచ్ఛ కుంచించుకుపోతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. విచారణ పూర్తికాకుండానే ఎన్నో ఏళ్లుగా జైలులో ఉన్న ఉమర్ ఖాలిద్ కేసు ఇందుకు ఉదాహరణ. అలాగే, జార్ఖండ్‌లో గిరిజన హక్కుల కోసం పనిచేసిన 84 ఏళ్ల ఫాదర్ స్టాన్ స్వామిని తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లోనూ జైలులో ఉంచారు. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న ఆయనకు స్రాట్‌తో మంచినీళ్లు తాగే కనీస సౌకర్యం కూడా సమయానికి కల్పించకపోవడం మానవ హక్కుల ఉల్లంఘనే. అదేవిధంగా, కార్మికులు, గిరిజనులు, అణగారిన వర్గాల హక్కుల కోసం పనిచేసిన సుధా భరద్వాజ్, ప్రొఫెసర్ సాయిబాబా వంటి సామాజిక కార్యకర్తలు సుదీర్ఘకాలం జైలు జీవితం, న్యాయపోరాటాలు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడం, అణగారిన వర్గాల పక్షాన నిలవడమే తప్పయ్యింది. దీని వలన న్యాయవ్యవస్థతో పాటు ఇతర రాజ్యాంగ సంస్థలపై కూడా ఒత్తిడి పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వ మతతత్వ, నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా 2026 జూన్ 22న ఫాసిస్ట్ వ్యతిరేక ఫ్రంట్ పంజాబ్ వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న సంస్థలు నిరంకుశ ధోరణులకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని విస్తరించాయి. సీపీఐ, ఆర్‌ఎంపీఐ, సీపీఐ(ఎం‌ఎల్) లిబరేషన్, సీపీఐ(ఎం‌ఎల్) న్యూ డెమోక్రసీ వంటి వామపక్ష రాజకీయ పార్టీలతో ఏర్పడిన ఈ ఫ్రంట్, ఈ పోరాటం కేవలం వామపక్షాలకే పరిమితం కాకుండా, అన్ని ప్రజాస్వామ్య శక్తులను కలుపుకొని ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు ప్రగతిశీల సంస్థలు, మేధావులు, సామాజిక ఉద్యమాలు, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి పౌరుడు ఏకం కావాలని వక్తలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంలో ప్రముఖ ఇటాలియన్ మార్కిస్స్ట్ ఆంటోనియో గ్రామ్సీ ఆలోచనలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫాసిజాన్ని ఓడించాలంటే కార్మిక వర్గం ఒక్కటే సరిపోదని, రైతులు, మేధావులు, ప్రజాస్వామ్య శక్తులు, ఇతర సామాజిక వర్గాలన్నీ ఐక్యంగా పోరాడాలన్నారు. పాలక వర్గాలు కేవలం బలప్రయోగంతోనే కాదు విద్య, సంస్కృతి, మతం, మీడియా ద్వారా ప్రజల సమ్మతిని కూడా పొందుతూ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తాయని ఆయన విశ్లేషించారు. అందువల్ల ప్రజల్లో విశ్వాసాన్ని గెలుచుకునే ప్రత్యామ్నాయ ప్రజాస్వామ్య భావజాలాన్ని నిర్మించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. అలాగే కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, విద్యాసంస్థలు, సాంస్కృతిక సంస్థలు, స్వతంత్ర మీడియా వంటి పౌర సమాజ సంస్థల్లో నిరంతర పోరాటం కొనసాగించాలని గ్రామ్సీ సూచించారు. ఫాసిజాన్ని ఓడించాలంటే ఎన్నికలు మాత్రమే సరిపోవని, సమాజం మొత్తం భాగస్వామ్యంతో సుదీర్ఘ సామాజిక, సాంస్కృతిక, రాజకీయ ఉద్యమం అవసరమన్నారు. అదే విధంగా బల్గేరియన్ కమ్యూనిస్టు నాయకుడు డిమిట్రోవ్ కూడా భావజాల భేదాలను పక్కనపెట్టి విస్తృత రాజకీయ ఐక్యతను నిర్మించాలని సూచించారు. పార్లమెంట్, కార్మిక సంఘాలు, యువజన, మహిళా, సాంస్కృతిక సంస్థలు వంటి ప్రజా వేదికల ద్వారా ఫాసిజానికి వ్యతిరేకంగా సంఘటిత ప్రతిఘటన నిర్మించాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు