ముంబయిః భారతదేశపు స్వదేశీ ఆండ్రాయిడ్ యాప్ మార్కెట్‌ప్లేస్ అయిన ఇండస్ యాప్‌స్టోర్, ఫ్రెంచ్ కన్స్యూమర్ టెక్నాలజీ బ్రాండ్ అయిన అల్కాటెల్‌తో వ్యూహాత్మక ఓఈఎం భాగస్వామ్యాన్నిబుధవారం ప్రకటించింది. ఈ దీర్ఘకాలిక భాగస్వామ్యంలో భాగంగా, భారతదేశంలోని అన్ని అల్కాటెల్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇండస్ యాప్‌స్టోర్ యాప్ స్టోర్‌గా ముందే ఇన్‌స్టాల్ చేయబడుతుంది. లోకల్ యాప్ మార్కెట్‌ప్లేస్‌ను అనుసంధానించడం ద్వారా, ఈ రెండు బ్రాండ్‌లు దేశవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ వినియోగదారులకు ఆవిష్కరణ, సులభ వినియోగాన్ని పెంపొందించడం కొనసాగిస్తాయి. ఫోన్‌పేకి చెందిన ఇండస్ యాప్‌స్టోర్ 45 కేటగిరీలలో ధృవీకరించబడిన మొబైల్ యాప్‌లు, గేమ్‌ల కేటలాగ్‌ను కలిగి ఉంది. ఇది 12 భారతీయ భాషలకు సపోర్ట్ చేస్తుంది, 10 ప్రాంతీయ భాషలలో వాయిస్ సెర్చ్‌ను అనుమతిస్తుంది. ఇంకా యూజర్లు యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు వాటిని చూసేందుకు వీలుగా, వీడియో ఆధారిత యాప్ డిస్కవరీ అనుభవాన్ని ఇది అందిస్తుంది. సాంప్రదాయ యాప్‌స్టోర్‌లకు భిన్నంగా, ఇండస్ యాప్‌స్టోర్ కేవలం యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి మాత్రమే కాదు, ప్రతి యూజర్‌కు తగిన యాప్‌లను సులువుగా కనుగొనడానికి కూడా వీలు కల్పిస్తుంది.


