Friday, March 6, 2026
Homeఅంతర్జాతీయం‘బగ్రామ్‌’పై నిర్ణయం అఫ్గాన్‌దే: చైనా

‘బగ్రామ్‌’పై నిర్ణయం అఫ్గాన్‌దే: చైనా

- Advertisement -

బీజింగ్‌: అఫ్గాన్‌లోని బగ్రామ్‌ వైమానిక స్థావరాన్ని తిరిగి తమ అధీనంలోకి తీసుకోవాలని అమెరికా నిర్ణయించడాన్ని చైనా ఖండిరచింది. దానిపై నిర్ణయాన్ని అఫ్గానిస్థాన్‌కు వదిలేయాలని సూచించింది. అఫ్ఘానిస్థాన్‌ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని చైనా గౌరవిస్తుందని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ వెల్లడిరచారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘అఫ్ఘానిస్థాన్‌ భవిష్యత్తుపై నిర్ణయాధికారం ఆ దేశానిది, అక్కడి ప్రజలది. ప్రాదేశిక ఘర్షణలకు ఆజ్యం పోస్తే మద్దతు లభించదు. ప్రాదేశిక సుస్థిరత కోసం సంబంధిత వర్గాలు నిర్మాణాత్మక పాత్ర పోషిస్తాయని ఆశిస్తున్నాం’ అని లిన్‌ అన్నారు. బగ్రామ్‌ ఎయిర్‌ ఫోర్స్‌ బేస్‌ను చైనా అధీనంలోకి తీసుకొని భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌ను వాడుకోవాలని భావిస్తుందని అమెరికా చెబుతోంది. అందుకోసమే ఆ స్థావరాన్ని తమ గుప్పెట్లోకి తెచ్చుకోవాలని ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇదే అంశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా వెల్లడిరచారు. నాలుగేళ్ల కిందట వదిలేసిన ఈ స్థావరాన్ని మళ్లీ స్వాధీనం చేసుకోవాలని, చైనాకు దగ్గరగా ఉంది కాబట్టి అక్కడ అమెరికా సైన్యం ఉండటానికి ప్రాధాన్యత ఉంటుంది అని ఆయన చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు