పూణే:భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన బజాజ్ అలియంజ్ జనరల్ ఇన్సూరెన్స్ గ్ల్లోబల్ ఇన్సూరెన్స్ ఎక్సలెన్స్ అవార్డుల (జిఐఇఎ)ను ప్రకటించింది. ఇది ఆసియా, మిడిల్ ఈస్ట్, నార్త్ ఆఫ్రికా అంతటా జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ సలహాదారులలో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి, గౌరవించడాన్ని లక్ష్యంగా కలిగి పెట్టుకుంది. పరిశ్రమలో పేరు పొందిన ఆసియా ఇన్సూరెన్స్ రివ్యూ (ఎఐఆర్) 2025 కొరకు ప్రతిష్టాత్మక అవార్డులను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి ఎంపిక చేయబడిరది. ఈ ఈవెంట్లో పదకొండు ప్రత్యేక అవార్డ్ కేటగిరీల ద్వారా భారతదేశంలో, అంతర్జాతీయంగా ఇన్సూరెన్స్ పరిశ్రమలో అసాధారణమైన ప్రతిభ కనబరిచిన సలహాదారులు గౌరవింపబడతారు. ఈ అవార్డులు అంతర్జాతీయ ఇన్సూరెన్స్ పరిశ్రమ నిపుణులతో కూడిన ఆగస్ట్ ప్యానెల్ మూల్యాంకనం చేస్తుంది.