Saturday, April 19, 2025
Homeవ్యాపారంబాదాములతో ఆరోగ్యంః నిర్ధారించిన నిపుణులు

బాదాములతో ఆరోగ్యంః నిర్ధారించిన నిపుణులు

న్యూదిల్లీ: కొత్త పీర్‌-రివ్యూడ్‌ ప్రచురణలో, ప్రపంచంలోని ప్రముఖ ఆరోగ్య , పోషకాహార నిపుణులు ప్రతిరోజూ బాదం తినడం కార్డియోమెటబాలిక్‌ ఆరోగ్యానికి అర్థవంతమైన ప్రయోజనాలను అందిస్తుందని తేల్చారు. పదకొండు మంది శాస్త్రవేత్తలు , వైద్యులు బాదం, కార్డియోమెటబాలిక్‌ ఆరోగ్యంపై పరిశోధనలు చేయటంతో పాటుగా బాదం ప్రయోజనాలపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ప్రతి రోజూ బాదం తినడం వల్ల గుండె ఆరోగ్యం, బరువు నిర్వహణ, గట్‌ మైక్రోబయోమ్‌కు మేలు జరుగుతుందని నిపుణులు కనుగొన్నారు. బాదం ఎక్కువగా తీసుకోవడం (కనీసం 50గ్రా/1.8ఓజెడ్‌ లేదా రోజుకు దాదాపు రెండు సర్వింగ్స్‌) కొంతమందిలో కొద్దిపాటి బరువు తగ్గడానికి సహాయపడుతుందని కూడా ఈ పరిశోధన తేల్చింది. ఈ నిపుణుల్లో వాషింగ్టన్‌ విశ్వవిద్యాలయంలో ఎపిడెమియాలజీ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఆడమ్‌ డ్రూనోవ్స్కీ, నేషనల్‌ డయాబెటిస్‌ ఒబేసిటీ అండ్‌ కొలెస్ట్రాల్‌ ఫౌండేషన్‌ (ఎన్‌డీఓసీ) అధిపతి డాక్టర్‌ అనూప్‌ మిశ్రా, న్యూట్రిషన్‌ రీసెర్చ్‌ గ్రూప్‌ అధిపతి డాక్టర్‌ సీమా గులాటి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు