బీజింగ్: రెండు రోజుల పర్యటన కోసం భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ సోమవారం మధ్యాహ్నం బీజింగ్ చేరుకున్నారు. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేపట్టారు. భారత్-చైనా సరిహద్దు సమస్యపై 25వ రౌండ్ ప్రత్యేక ప్రతినిధుల చర్చలు మంగళ వారం జరగనున్నాయి. ఈ సమావేశంలో భారత ప్రత్యేక ప్రతినిధిగా అజిత్ దోవల్, చైనా ప్రత్యేక ప్రతినిధిగా విదేశాంగ మంత్రి వాంగ్ యీ పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం, దోవల్ తన పర్యటనలో చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్ను కూడా కలవనున్నారు. ఇటీవల జూన్లో న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం సందర్భంగా దోవల్, వాంగ్ యీ సమావేశమయ్యారు. ఆ సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ ‘నిర్మాణాత్మకమైనది, భవిష్యత్ దిశగా సాగేదిగా’ అభివర్ణించింది.
బీజింగ్కు అజిత్ దోవల్
- Advertisement -
RELATED ARTICLES


