ముంబయి: బుక్ మై షో ఫౌండేషన్ సగర్వంగా బుక్ ఏ ఛేంజ్ ప్రారంభాన్ని ప్రకటించింది. ఇది సంగీతం, ప్రదర్శన కళల పరివర్తన శక్తి ద్వారా నిరుపేద ప్రతిభావంతుల జీవితాలను సుసంపన్నం చేయడానికి అంకితం చేయబడిరది. భారతదేశ ప్రముఖ వినోద గమ్యస్థానమైన బుక్ మై షో ద్వారా 2014లో బుక్ ఎ స్మైల్గా ప్రారంభించబడి, ప్రభావపూరితంగా నడిచిన ఈ కార్యక్రమం ఇప్పుడు పేదరికం నేపథ్యాల నుండి వచ్చిన వ్యక్తులు, సమూహా లకు సంగీతం, ప్రదర్శన కళలకు ప్రాప్యతను అందుబాటులోకి తేవాలనే కొత్త దృష్టితో బుక్ ఏ ఛేంజ్గా మార్పు చెందింది. బుక్ ఏ ఛేంజ్ ప్రధాన ఆశయం సంగీతం, ప్రదర్శన కళలలో భవిష్యత్ మార్గదర్శకులను ప్రేరేపించడం.