విశాలాంధ్ర-విజయనగరం: మాజీ మంత్రి, శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ బుధవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. చీపురుపల్లిలో నిర్వహించిన విద్రోహదినం కార్యక్రమానికి హాజరైన ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ప్రచార వాహనంలో మాట్లాడుతున్న సమయంలో ఎండ తీవ్రతకు తట్టుకోలేక సొమ్మసిల్లి పోయారు. పక్కనే ఉన్న మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఇతర నేతలు ఆయనను వెంటనే పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయానికి తరలించారు. కొద్ది సేపటికి తేరుకున్న బొత్స… అక్కడనుంచి అందరికీ అభివాదం చేస్తూ తనకు ఆరోగ్యం కుదుట పడిరదని చెబుతూ తన వాహనంలో విశాఖ వెళ్లిపోయారు.