విశాలాంధ్ర – కడియం : కిసాన్ మేళాలు రైతులకు ఎంతో ఉపయోగకరమైనవని కడియం మండలం, జేగురుపాడు ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మార్టేరులో జరిగే కిసాన్ మేళాకు జేగురుపాడు గ్రామ రైతులు బుధవారం బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీటీసీ నాగిరెడ్డి రామకృష్ణ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఇలాంటి కార్యక్రమాలకు హాజరై తమ విజ్ఞానాన్ని పెంపొందించుకుని, నూతన వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని సూచించారు. మర్రెడ్డి రమేష్ మాట్లాడుతూ, రైతుల అభివృద్ధి కోసం విజ్ఞానాన్ని పెంచే ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో నాగేశ్వరరావు, కర్రి చినబాబు, వనమాలి వీరకృష్ణ, ఇడుపుగంటి సత్యనారాయణ, ఆకుల పాలయ్య, ఆచంట కాశీవిశ్వనాథం, వనమాలి శ్రీనివాస్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మార్టేరులో కిసాన్ మేళాకు వెళ్లిన జేగురుపాడు రైతులు
- Advertisement -
RELATED ARTICLES


