నిధుల బిల్లుకు ప్రతినిధుల సభ ఆమోదం
ట్రంప్ సంతకం
వాషింగ్టన్: అమెరికా ఆర్థిక ‘షట్‌డౌన్’కు ఎట్టకేలకు తెర దించింది. షట్‌డౌన్‌ను ముగించే ప్రభుత్వ నిధుల బిల్లుపై ప్రతినిధుల సభలో ఓటింగ్ జరిగింది. 222-209 తేడాతో ఆమోదం లభించింది. సెనేట్ ఇంతకుముందే ఆమోద ముద్ర పడిరది. ఇక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ బిల్లుపై సంతకం చేశారు. దీంతో 43 రోజుల తర్వాత షట్‌డౌన్‌కు అధికారికంగా ముగింపు లభించింది. ఇన్ని రోజులు ఆర్థికపరంగా కార్యకలాపాలు స్తంభించడం అన్నది అమెరికా చరిత్రలో ఎప్పుడు జరగలేదు. దోపిడీకి లొంగేది లేదన్న సందేశాన్ని ప్రపంచానికి ఇచ్చామంటూ ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. డెమొక్రాట్ల చర్యలు ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చాయని చెప్పారు.
32 సంస్థలు, వ్యక్తులపై అమెరికా ఆంక్షలు
భారత్, చైనా సహా అనేక దేశాలకు చెందిన 32 సంస్థలు, వ్యక్తులపై అమెరికా తాజాగా ఆంక్షలు విధించింది. ఇరాన్ బాలిస్టిక్ క్షిపణుల ప్రోగ్రాంతో సంబందధమున్నట్లు పేర్కొంది. ఆయుధాలు తయారు చేయకుండా ఇరాన్‌ను కట్టడి చేయడంలో భాగంగా అధ్యక్షుడు ట్రంప్ ఈ చర్యలు తీసుకున్న ట్లు అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడిరచింది. భారత్, చైనా, హాంగ్‌కాంగ్, యూఏఈ, టర్కీ, ఇరాన్‌తో పాటు ఇతర దేశాల నుంచి కార్యకలాపాలు సాగిస్తూ… ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ అండ్ అన్‌మాన్డ్ ఏరియల్ వెహికల్ (యూఏవీ) ఉత్పత్తకి మద్దతిచ్చే బహుళ ప్రొకూర్‌మెంట్ నెట్‌వర్కులపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. అణు ముప్పు లేకుండా చేయడం కోసం ఇరాన్‌పై ట్రంప్ తీవ్రఒత్తిడి తెస్తున్నట్లు అమెరికా కార్యదర్శి జాన్ కె హర్లే అన్నారు. భారత్‌కు చెందిన ఫార్మ్‌లేన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌కు చెందిన మార్కో క్లింగె (క్లింగె)తో అమెరికా ట్రజరీ శాఖ ముడిపెట్టింది.
మా వాళ్లకు శిక్షణ ఇచ్చి పోండి: బెసెంట్
తమ దేశంలో ప్రతిభావంతుల కొరత ఉన్నట్లు అధ్యక్షుడు ట్రంప్ అంగీకరించిన తర్వాత హెచ్`1బీ వీసాలపై అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వీసాలపై వచ్చిన వారు అమెరికన్లకు శిక్షణ ఇచ్చి తిరిగి వెళ్లాలన్నారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అని తేల్చిచెప్పారు. ఇదే ట్రంప్ కొత్త విధానం అని వెల్లడిరచారు. ‘విదేశీ కార్మికులపై ఎక్కువ కాలం ఆధారపడకుండా అమెరికన్లలో నైపుణ్యత పెంపొందించాలి. వారికి శిక్షణ ఇప్పించడం కోసం నైపుణ్యతగల విదేశీ కార్మికులను తాత్కాలికంగా అమెరికాకు తేవడమే కొత్త విధానం’ అని అన్నారు. అమెరికా తయారీ రంగాన్ని పునరుద్ధరించేందుకు విజ్ఞాన బదిలీ (నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్)కి యత్నిస్తున్నట్లు తెలిపారు. సెమీకండక్టర్ పరిశ్రమను అమెరికాకు తేవాలని ఉందని బెసెంట్ వెల్లడిరచారు.
భారత్‌కు మా అవసరం లేదు: రూబియో
‘దిల్లీలోని ఎర్రకోట వద్ద పేలుడుపై దర్యాప్తునకు సహాయం చేస్తామన్నాం కానీ భారత్‌కు మా అవసరం లేదు’ అని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో అన్నారు. భారత అధికారులు వృత్తి నైపుణ్యంతో ఈ దర్యాప్తు సాగిస్తున్నారన్నారు. కెనడాలో జీ7 విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు అమెరికా రాయబారి సెర్గియో గోర్ సామాజిక మాధ్యమం వేదికగా స్పందించారు. మృతుల కుటుంబాలు ఈ దు:ఖం నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పోస్టు పెట్టారు.


