రాజు గారి ఇంట్లో ఏ పండగో, పబ్బమో, పెళ్లో, ఉత్సవమో జరిగితే ఊరుఊరంతా కదలాల్సింది. ఎవరి పొలంలో పండింది వారు, ఎవరి దగ్గర ఏముంటే అది రాజుగారి ఇంట్లో జరిగే సందడికి అర్పించాల్సిందే. రాజు ఎంత బలవంతుడైతే ఈ హడావుడి అంత ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి మోదీకి 75 ఏళ్లు నిండుతాయి. గత సంవత్సరం ఆయన 75వ ఏట ప్రవేశించినప్పుడూ 75వ జన్మదినం అట్టహాసంగానే జరిగింది. అదనపు ఆకర్షణ ఏమిటంటే 75 ఏళ్లు వచ్చాయి కనక ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకుంటారని ఓ వ్యర్థ చర్చ సుదీర్ఘ కాలమే సాగింది. 75 ఏళ్లు వస్తే సకల బాధ్యతలూ వదులుకోవాల్సిందేనని ఆర్.ఎస్.ఎస్. అధిపతి మోహన్ భగవత్ ఓ కొత్త చర్చనీయాంశాన్ని తెర మీదకు తెచ్చారు. మోదీతో పాటు మోహన్ భగవత్ కూడా గత ఏడాదే 75వ ఏట ప్రవేశించారు. సుద్దులు చెప్పిన భగవత్ పదవి వదులుకోలేదు. మోదీ కూడా వదులుకోలేదు. ఇటీవలి కాలంలో రాజకీయ పండితులు ఫలానా తేదీకి మోదీ తప్పుకుంటారు చూడండి అని ముహూర్తాల మీద ముహూర్తాలు పెడ్తున్నారు. ఆ ముహూర్తం దాటిపోతే మరో కొత్త ముహూర్తం పెడ్తున్నారు. కానీ మోదీ ప్రణాళికలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఆయన 75వ ఏడు పూర్తి చేసుకున్న సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 దాకా మోదీ జన్మదిన మాసోత్సవాలు నిర్వహించాలను కుంటున్నారు. ఈ ఉత్సవాలు దేశమంతటా జరుగుతాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయి 25 సంవత్సరాలు నిండేది కూడా ఇప్పుడే. అందుకే రెండింటినీ కలిపి భారీ సంరంభం నిర్వహిస్తున్నారు. పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం రాష్ట్రాల ముఖ్య మంత్రులు అప్పుడే కార్యరంగంలోకి దూకారు. తమ మంత్రివర్గ సమా వేశాలు ఏర్పాటుచేసి మోదీ 76వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జర పాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా రకరకాల కార్య క్రమాలు జరుగుతాయి. కొన్ని చోట్ల ప్రధాన కట్టడాల దగ్గర లేజర్ షోలు జరుగుతాయి. యాత్రాస్థలాల్లో ప్రత్యేక పూజాదికాలు, జిల్లాల స్థాయిలోనే కాక గ్రామస్థాయిలోనూ సభలూ, సమావేశాలు పెట్టి మోదీ జన్మదినోత్సవాల సందడి మార్మోగేట్టు చేస్తారు. సెప్టెంబర్ ఏడున అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వశర్మ, బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి మంత్రివర్గ సమాశాలు నిర్వహించి ఎవరు చేయాల్సిన పనులు వారికి పురమాయించేశారు. వీరిద్దరూ ముఖ్య మంత్రులు కావడానికి కొద్దికాలం ముందే బీజేపీ తీర్థం పుచ్చు కున్నారు. అందువల్ల తమ విశ్వాసపాత్రతను నిరూపించు కోవడానికి అదనపు పాట్లు పడాల్సిందేగా! హర్యానా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెప్టెంబర్ రెండునే ప్రభుత్వ కార్యదర్శుల సమావేశం ఏర్పాటుచేసి ఏమేం చేయాలో చెప్పేశారు. ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి బాధ్యత ఏంటి, వివిధ కార్యక్రమాల అమలుకు అనుసరించవలసి పద్ధతి ఏమిటి అని సకలమూ వివరించేశారు. వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో మోదీ జన్మదినోత్సవాల కోసం అమలుచేయాల్సిన 14 కార్యక్రమాలను రూపొందించారు. ఈ కార్యక్రమాలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం రూపొందించుకుంటున్నవి కావు. అన్ని చోట్లా ఇవే 14 కార్యక్రమాలు జరుగుతాయి. అంటే ఉన్నత స్థాయిలోనే మొత్తం కార్యక్రమం రూపొందిందనుకోవాలి. నెల రోజుల పాటు జరిగే సేవా సంకల్Î కార్యక్రమంలో ఆశీర్వాద్ కా దియా, దేశంలో 250 మిలియన్ల బాలుర కలలు, నమో సేవాగాథా, ఆంగన్ కా ఉత్సవ్, కహానీ బల్దేవి కి, వికసిత్ భారత్ సంకల్Î యాత్ర, సేవా జ్యోతీ యాత్ర, వాద్ నగర్ నుంచి వారణాసి దాకా జన, జల్ సేవా సంకల్ప యాత్ర, సేవా సేతు అభియాన్, రంగోలీ రాష్ట్ర, జాతీయ నూతన ఆవిష్కరణ సవాలు, సేవా మహా కుంభం (పంచాయత్ నుంచి పార్లమెంటు దాకా) విదేశాలలో మహా యాగాలు అట్టహాసంగా నిర్వహిస్తారు. ఆశీర్వాద్ దియా కార్యక్రమం పోలింగ్ కేంద్ర స్థాయిలో ప్రారంభం అవుతుంది. ఇది గ్రామగ్రామాన జరిగే కార్యక్రమానికి పరిమితమైంది కాదు అంటే ఇంత సూక్ష్మమైన ప్రణాళికలు రూపొందిం చారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్ర స్థాయిలోనూ ఇది జరుగుతుంది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసినా మోదీ 76వ జన్మ దినోత్సవాల కోసం ఎంత పకడ్బందీగా కార్యక్రమాలు రూపొందిం చారో అర్థం అవుతుంది. ఈ ఉత్సవాలు సెప్టెంబర్ 17 నుంచి అక్టో బర్ 17 దాకా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోనూ, ప్రైవేటు పాఠశాల ల్లోనూ నిర్వహిస్తారు. వికసిత్ భారత్ అన్న అంశంపై పాఠశాలల్లో వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు జరుగుతాయి. దీనికోసం ప్రతి పాఠశాలకు ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తారు. ఈ పోటీల నిర్వ హణకు ఉపాధ్యాయులకు అవసరమయ్యే సకల సామాగ్రిని సమ కూరుస్తారు. ఈ నెలరోజుల పాటు కొనసాగే “సేవా మేరా యోగ్దాన్” కార్యక్రమంలో పౌరుల పాత్ర ఉండేట్టు చూసుకుంటారు. మునిసిపల్ కమిషనర్లు ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాలకు బాధ్యత వహించాలి ంటుంది. రక్త దానాలు, వృద్ధాశ్రమాల సందర్శన, మొక్కలు నాటడం, స్వచ్ఛతా హీ సేవా, ఆరోగ్య శిబిరాలు, డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, యోగ, నషా ముక్త్ భారత్ లాంటి అనేకానేక కార్యక్రమాలు చేపడ్తారు. విదేశాల్లో మహాయాగంలో భాగంగా 25 దేశాల్లో సూర్యోదయ సమయానికి ప్రత్యేక “ఆహుతి” కార్యక్రమాలు ఏర్పాటవుతాయి. గత ఏడాది మోదీ 75వ సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు రాజకీయ నాయకులు, క్రీడాకారులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, ప్రైవేటు కంపెనీలు, విద్యాసంస్థలు ఉత్సాహంగా మోదీ జన్మదినోత్సవంలో పాల్గొన్నాయి. వీటన్నింటికీ అయ్యే ఖర్చు ఎవరు పెట్టుకుంటారు అనే అమాయకపు ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మోదీ ప్రభుత్వం మీడియాలో ప్రకటనలు జారీ చేయడానికి రూ. 119.79 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రభుత్వమే పార్లమెంటులో చెప్పింది. అంతకుముందు డిసెంబర్లో గత అయిదేళ్ల కాలమో మోదీ ప్రతిష్ఠ ఇనుమడింప చేయడానికి వ్యాపార ప్రకటనల కోసం రూ.2,447 కోట్లు ఖర్చయ్యాయని కూడా ప్రభుత్వం తెలియజేసింది. అంటే మోదీ ప్రచారం కోసం రోజుకు రూ. 1.34 కోట్లు ఖర్చు అవుతాయి. ఇదంతా ప్రభుత్వ ఖజానా నుంచే భరిస్తారు. అనుమానం దేనికి. మోదీ జన్మదిన బ్రోˆత్సవాలకు ఆ మాత్రం ఖర్చు పెట్టలేనంతటి పేద దేశం ఏమీ కాదుగా మనది.


