Homeరేషన్ వ్యవస్థకు‘కార్పొరేట్’ గ్రహణం!

రేషన్ వ్యవస్థకు‘కార్పొరేట్’ గ్రహణం!

- Advertisement -

త్వరలో రాష్ట్రంలో ‘మినీ మార్ట్’ల ఏర్పాటు
పేదల బియ్యం దుకాణాల్లో ప్రైవేట్ వ్యాపారాలు
పక్కా ప్రణాళికతో ప్రైవేట్ సంస్థకు అప్పగింత

విశాలాంధ్ర`సచివాలయం : రాష్ట్రంలో పేదల ఆకలి తీరుస్తూ దశాబ్దాలుగా సాగుతున్న ప్రజా పంపిణీ వ్యవస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తూ, చౌక ధరల దుకాణాలను కార్పొరేట్ శక్తుల లాభార¨న కేంద్రాలుగా మార్చేందుకు పౌs Áసరఫరాల శాఖ అత్యుత్సాహం ప్రదర్శిస్తోం ది. రేషన్ దుకాణాలను ఆధునిక ‘మినీ మార్ట్లు’ గా నిరంతరాయంగా నడిచే ‘కమ్యూనిటీ రిటైల్ కేంద్రాలు’ గా తీర్చిదిద్ది డీలర్ల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తా మంటూ ప్రభుత్వం చెబుతున్న రంగుల మాటల వెనుక నిరుపేద డీలర్లను అప్పలను ఊబిలోకి నెట్టే పక్కా వ్యూహం దాగి ఉందనే విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. కార్డుదారులకు సకల సరుకులు భవిష్యత్‌లో సబ్సిడీ బియ్యం, ఇతర నిత్యావసరాల సరఫరా బాధ్యత నుంచి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసి, ఈ మొత్తం వ్యవస్థను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించేం దుకే ఈ ‘మినీ మార్ట్’ నాటకానికి తెరతీశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేద కుటుంబాలకు ఆధారంగా ఉన్న చౌక ధరల దుకాణాలను ఒక్కసారిగా కమర్షియల్ మాల్స్‌గా మార్చాలని చూడటం క్షేత్రస్థాయి వాస్తవాలకు విరుద్ధమని, ఇది డీలర్ల పాలిట యమపాశంగా మారబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 29,794 రేషన్ షాపులు ఉండగా, అందులో కనీసం 200 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉన్న షాపులనే మినీ మార్ట్లుగా మారుస్తామని పౌరసరఫరాల శాఖ సరికొత్త మెలిక పెట్టింది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రం మొత్తం మీద వెతికినా తొలి దశలో గుంటూరు (125), ఎన్‌టీఆర్ (93), ఏలూరు (163), కృష్ణా (152) జిల్లాల్లో కలిపి కేవలం 533 షాపులను మాత్రమే అధికారులు గుర్తించగలిగారు. అంటే, దాదాపు 98 శాతానికి పైగా ఉన్న మిగిలిన 29 వేలకు పైగా రేషన్ దుకాణాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇరుకు సందుల్లో, చిన్న చిన్న అద్దె గదుల్లో నడుస్తున్నందున ఈ ప్రాజెక్టుకు పూర్తిగా అనర½మైనవని స్పష్టమవుతోంది. స్థలాభావ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ఈ వేలాది మంది చిన్న డీలర్ల పరిస్థితి ఏమిటనే దానికి ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాధానం లేదు. భవిష్యత్‌లో ఈ స్థలం నిబంధనను అడ్డం పెట్టుకుని వేలాది మంది పేద డీలర్ల లైసెన్సులను రద్దు చేసి, ఆ దుకాణాలను కూడా పెద్ద కార్పొరేట్ మాల్స్‌ పరిధిలోకి మార్చేందుకే ఈ వ్యూహం పన్నారనే అనుమానాలు రేషన్ డీలర్ల సంఘాల్లో గుబులు రేపుతున్నాయి. అంతేకాకుండా ఈ మినీ మార్ట్లకు నిత్యావసర సరుకులను సరఫరా చేసే బాధ్యతను ప్రభుత్వ రంగ సంస్థలకు కాకుండా ఏరికోరి ‘ఫ్రాంటియర్ మార్కెట్స్‌’ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడం వెనుక ఆరోపణలు జోరుగా సాగుతున్నాయి. వ్యాపార నమూనా, అమలు విధానాన్ని పరిశీలించామని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ సదరు కార్పొరేట్ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ పర్యవేక్షణ లేని ప్రైవేట్ ఉత్పత్తులను రేషన్ దుకాణాల్లో ఉంచడం ద్వారా వాటి ధరలపై నియంత్రణ ఎవరిదనే ప్రశ్న తలెత్తుతోంది. పేద కార్డుదారులు రేషన్ బియ్యం కోసం వస్తే వారిపై బలవంతంగా ఈ ప్రైవేట్ కంపెనీ సరుకులను రుద్దే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రావాల్సిన కమీషన్‌లు సకాలంలో అందక, షాపుల అద్దెలు, కరెంట్ బిల్లులు కట్టలేక రేషన్ డీలర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతుంటే… ఇప్పుడు మినీ మార్ట్ల పేరిట కొత్త సరుకులు కొనుగోలు చేసి పెట్టుబడులు పెట్టాలంటూ పౌరసరఫరాల శాఖ ఒత్తిడి తేవడం వారిని అప్పలపాలు చేయడమేనని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ప్రైవేట్ కంపెనీ సరుకులు అమ్ముడుపోకపోతే ఆ నష్టాన్ని డీలర్లే భరించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం… గుంటూరు జిల్లాలో గుర్తించిన కేవలం 10 రేషన్ షాపుల్లో ఈ నెల నుంచే ఈ మినీ మార్ట్ల పైలట్ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. అసలు ఈ 10 దుకాణాల్లో వ్యాపారం ఎలా సాగుతుంది, డీలర్లు ఎంత అప్పుల పాలవుతారు, కార్డుదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వస్తుందనే కనీస ప్రాథమిక అంచనాలు, క్షేత్రస్థాయి అధ్యయనం చేయలేదు. పైగా గుంటూరులో పైలట్ ప్రాజెక్టు విజయవంతమయితే ఆ వెంటనే రాష్ట్రంలోని అన్ని రేషన్ షాపులకూ విస్తరిస్తాం’ అని అధికారులు ప్రకటించడం వారి తొందరపాటుతనానికి, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చాలనే ఆరాటానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వం తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే, పేదలకు అందే ఉచిత రేషన్ వ్యవస్థ పూర్తిగా నాశనమవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది రేషన్ డీలర్లు రోడ్డున పడడం తప్ప మరో మార్గం లేదని డీలర్ల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు