Saturday, April 19, 2025
Homeఆంధ్రప్రదేశ్శ్రీ సెవెన్‌ హిల్స్‌ పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం

శ్రీ సెవెన్‌ హిల్స్‌ పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం

విశాలాంధ్ర-విజయవాడ : ప్జానిక సీతారాంపురంలోని శ్రీ సెవెన్‌ హిల్స్‌ పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం వినూత్న రీతిలో జరిగింది. చిన్నారులకు వివేకానందుని వేషధారణతో కూడిన వస్త్రధారణను విద్యార్థులు ధరించి తమ తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వివేకానందుని వేషధారణను ఎన్నుకోవడంలో ముఖ్య ఉద్దేశము వివేకానందుని జీవితము ఎంతో మందికి ఆదర్శము. యువతకు స్ఫూర్తిదాయకము అని పాఠశాల కరస్పాండెంట్‌ దుర్గాప్రసాద్‌ రాజు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందజేయటమే మా పాఠశాల ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. విద్యార్థులు దేశభక్తి గీతాలకు నృత్య ప్రదర్శనలు చేశారు. ప్రేక్షకులను ఆద్యంతము ఆకర్షింపజేసే విధంగా కార్యక్రమాలు జరిగాయి. తల్లిదండ్రులు మాట్లాడుతూ, ఇటువంటి పాఠశాలలో తమ పిల్లలను చదివించటం తమకు ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. చదువుతోపాటుగా నైతిక విలువలను చిన్న వయస్సు నుండి విద్యార్థులలో పెంపొందించుకోవాలని చల్లా లక్ష్మీ నారాయణ అన్నారు. వివేకానందుని వేషధారణలతో పాఠశాల ప్రాంగణం అంతా కళకళలాడిరది. చిన్నారులతో స్వామి వివేకానందుడు ఉన్నట్టుగా వాతావరణం కనిపించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు రామకృష్ణ, జె.వి.షణత్‌ కృష్ణ, రాఘవరాజు. దుర్గాప్రసాద్‌, తల్లిదండ్రులు పాల్గొన్నారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ డి. సునీత కార్యక్రమం పర్యవేక్షించారు. ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంతో ఉత్పాహంగా కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు