స్టాక్‌హోమ్: స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు పూర్తి అయ్యాయి. మూడు దశాబ్దాల కిందట అంటే 1995 నవంబరు 4`5 తేదీల్లో స్వీడెన్ కమ్యూనిస్టులు నిర్ణయాత్మక ముందడుగు వేశారు. కమ్యూనిస్టు విప్లవాత్మకతను కొనసాగించాలని నిర్ణయించారు. ఆ తేదీల్లోనే స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ పేరును మరోమారు సొంతం చేసుకున్నారు. శ్రామికవర్గం ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తితో సోషలిజం కోసం పోరాటాలతో ఈ పేరు ముడిపడి ఉంది. ప్రస్తుతం జరుపుకునే 30వ వార్షికోత్సవం పార్టీ సంస్థాగత చరిత్రలో కీలక ఘట్టం మాత్రమే కాదు… కమ్యూనిస్టు ఉద్యమంలో దశాబ్దాలు సాగిన అవకాశవాదంపై రాజకీయ విజయానికి గుర్తు. అయితే స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ పేరు ఓ బాధ్యతగా పార్టీ పేర్కొంది. స్వీడెన్‌లో కమ్యూనిస్టు ఉద్యమం ఎప్పుడూ ఓడిపోలేదని, సవాళ్లను మాత్రమే ఎదుర్కొందని, అంచెలంచెలుగా ఎదిగిందని ఈ వార్షికోత్సవం నొక్కి చెబుతోందని వెల్లడిరచింది. భవిష్యత్తుపై మరింత విశ్వాసంతో పార్టీ ముందుకెళుతోందని, శ్రామికవర్గానికి అండగా నిలుస్తోందని పేర్కొంది. చారిత్రక పోరాటాలకు భవిష్యత్తు విజయాలకు మధ్య ప్రత్యక్ష సాక్షిగా ఈ పేరును గౌరవిస్తున్నామని స్వీడెన్ కమ్యూనిస్టు పార్టీ వెల్లడిరచింది.
స్వీడెన్ కమ్యూనిస్టు విప్లవానికి 30 ఏళ్లు
- Advertisement -
RELATED ARTICLES


