Homeఅంతర్జాతీయంఅక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’

అక్రమ వలసదారులకు ‘ఎగ్జిట్ బోనస’

- Advertisement -

2,600 డాలర్లు ఇస్తామని అమెరికా ప్రకటన

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వచ్ఛందంగా అమెరికాను వీడితే ‘ఎగ్జిట్ బోనస’ ఇస్తామని ప్రకటించింది. అక్రమ వలసదారులకు ఈ ఆఫర్‌ను అమెరికా ఇస్తోంది. వారికి 2,600 డాలర్లు అంటే సుమారు రూ.2,40,329 నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని హోమ్‌ల్యాండ్ భద్రతా విభాగం వెల్లడించింది. అక్రమ వలసదారులు అమెరికా నుంచి వారి దేశాలకు వెళ్లిపోయేందుకు ఉచితంగా విమాన ప్రయాణ సౌకర్యాన్ని ట్రంప్ సర్కారు కల్పించనుంది. ఇందుకోసం ‘సీబీపీ హోమ’ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించింది. దేశాన్ని వీడే సమాచారాన్ని ముందస్తుగానే చేరవేయాలని ఆదేశించింది. యాప్‌లో పేరు నమోదు చేసుకోగానే వారిని ‘బలవంతపు బహిష్కరణ’ జాబితా నుంచి తొలగిస్తామని, తద్వారా అరెస్టులు, శిక్షల భయం ఉండదని వెల్లడించింది. ఈ ప్రత్యేక ఆఫర్‌ను వినియోగించుకుని ఇప్పటివరకు 22 లక్షల మందికిపైగా స్వదేశాలకు తిరిగి వెళ్లిపోయారని గణాంకాలు చెబుతున్నాయి. 2025 జనవరి నుంచి చేపట్టిన బహిష్కరణ చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నట్లు హోమ్‌ల్యాండ్ భద్రతా విభాగం పేర్కొంది. బహిష్కరణల కారణంగా అమెరికా ప్రభుత్వానికి వేల కోట్ల డాలర్ల ఆర్థిక భారం పడుతోందని, భద్రతా బలగాల మోహరింపు, నిర్బంధ కేంద్రాల నిర్వహణ వంటివి వ్యయంతో కూడుకున్నవేనని తెలిపింది. ఈ ఆఫర్ ఇవ్వడంతో తక్కువ ఆర్థిక భారంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. అంతే కాకుండా అక్రమంగా వచ్చిన వారికి గౌరవప్రదమైన నిష్క్రమణ సౌలభ్యం లభిస్తుందని అన్నారు. ఈ పద్ధతి అక్రమ వలసదారులు వారి దేశాలకు వెళ్లేందుకు సురక్షితమైన, చవకైన మార్గమని అధికారులు పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు