Thursday, May 15, 2025
Homeవ్యాపారంఅపోలో హెల్త్‌కేర్‌తో ఎస్‌బీఐ కార్డ్‌ భాగస్వామ్యం

అపోలో హెల్త్‌కేర్‌తో ఎస్‌బీఐ కార్డ్‌ భాగస్వామ్యం

న్యూదిల్లీ: భారతదేశంలో అతిపెద్ద ప్యూర్‌-ప్లే క్రెడిట్‌ కార్డ్‌ జారీదారు అయిన ఎస్‌బీఐ కార్డ్‌, దేశంలోని అతిపెద్ద రిటైల్‌ ఫార్మసీ నెట్‌వర్క్‌ను నిర్వహించే అపోలో హెల్త్‌కో, అలాగే ప్రముఖ ఓమ్ని-ఛానల్‌ డిజిటల్‌ హెల్త్‌ ప్లాట్‌ఫామ్‌ అపోలో 24/7 తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించాయి. ఈ భాగస్వామ్య ఫలితంగా, ఆరోగ్య, సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించిన సహ-బ్రాండెడ్‌ క్రెడిట్‌ కార్డ్‌ – అపోలో ఎస్‌బీఐ కార్డ్‌ సెలెక్ట్‌ కార్డ్‌ను ప్రారంభించాయి. నేటి ఆరోగ్య స్పృహ కలిగిన వినియోగదారుల అభివృద్ధి చెందుతున్న అవసరాలను తీర్చడానికి ఈ ప్రీమియం క్రెడిట్‌ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఇది ఆరోగ్య సంరక్షణ పొదుపులు, ఆర్థిక బహుమతుల ఆకర్షణీయమైన మిశ్రమాన్ని అందిస్తుంది. కస్టమర్‌లు ఈ క్రెడిట్‌ కార్డ్‌ కోసం ఎస్‌బీఐ కార్డ్‌ అధికారిక వెబ్‌సైట్‌ ఎస్‌బీఐకార్డ్‌.కామ్‌ను సందర్శించడం ద్వారా లేదా అపోలో 24/7 యాప్‌లో డిజిటల్‌గా సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు