Homeఆంధ్రప్రదేశ్అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

అమరావతిలో 500 పడకలతో కిమ్స్ ఆసుపత్రి

- Advertisement -

విశాలాంధ్ర-సచివాలయం: ప్రజారాజధాని అమరావతిలో వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ ప్రముఖ కార్పొరేట్ సంస్థ కృష్ణా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ భారీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ కిమ్స్ ప్రతినిధుల మధ్య గురువారం అధికారికంగా లీజు ఒప్పందం కుదిరింది. అమరావతిలోని మంగళగిరి మండలం, నిడమర్రు రెవెన్యూ గ్రామంలో కేటాయించిన 2 ఎకరాల భూమిలో 500 పడకల సామర్థ్యంతో ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు, స్పెషాలిటీ చికిత్సలను రాజధాని ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఈ సంస్థ పని చేయనుంది. ఈ మేరకు ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (ఎస్టేట్స్) జుబిన్ చిరాన్ రాయ్ లీజు అగ్రిమెంటుపై సంతకం చేసి… పత్రాలను కిమ్స్ ప్రతినిధులకు అందజేశారు. ఈ ఆసుపత్రి స్థాపన ద్వారా అమరావతి పరిసర ప్రాంతాల వారికి ఆధునిక వైద్య సేవలు మరింత చేరువ కావడమే కాకుండా స్థానికులకు ఉపాధి అవకాశాలు కూడా లభించనున్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు