Thursday, February 20, 2025
Homeఅంతర్జాతీయంఅమెరికా వైఖరిపై చైనా ఆగ్రహం

అమెరికా వైఖరిపై చైనా ఆగ్రహం

బీజింగ్‌ : తైవాన్‌కు సంబంధించిన వైఖరిపై అమెరికా తీసుకొన్న ఓ నిర్ణయంపై చైనా మండిపడిరది. ‘తైవాన్‌ స్వాతంత్య్రానికి మేము మద్దతు ఇవ్వం’ అని అమెరికా విదేశాంగ శాఖ వెబ్‌సైట్‌లో ఉన్న స్టేట్‌మెంట్‌ను తాజాగా తొలగిం చారు. ఈ విషయం చైనా ఆగ్రహానికి కారణమైంది. దీనిపై చైనా విదేశాంగ శాఖ స్పందిస్తూ..‘ఇది తైవాన్‌ వేర్పాటు వాదానికి మద్దతిచ్చేవారికి తప్పుడు సంకే తాలు పంపుతుంది. దీనిని సరిచేసుకోవాలి’ అని అమెరికాను హెచ్చరించింది. అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లోని తైవాన్‌-అమెరికా సంబంధాల ఫ్యాక్ట్‌షీట్‌లో గతంలో ‘మేము తైవాన్‌ స్వాతంత్య్రాన్ని సమర్థించం’ అని ఉండేది. ఈ వాక్యాన్ని గత వారం తొలగించారు. సాధారణ అప్‌డేట్‌గా దీనిని అమెరికా అభివర్ణిం చింది. తాము వన్‌ చైనా పాలసీకి కట్టుబడి ఉన్నామని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి వెల్లడిరచారు. మరోవైపు తైవాన్‌ దిశగా చైనా భారీ స్థాయిలో యుద్ధనౌకలు, విమానాలను పంపింది. మొత్తం 41 విమానాలు, 9 నౌకలను పంపింది. ఈ విషయాన్ని తైవాన్‌ రక్షణశాఖ ఓ ప్రకటనలో వెల్లడిరచింది. కాగా కెనడాకు చెందిన ఓ యుద్ధ నౌక తైవాన్‌ జలసంధి నుంచి ప్రయాణించడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. హెచ్‌ఎంసీఎస్‌ ఒట్టావా శనివారం దక్షిణం నుంచి ఉత్తర ప్రాంతానికి ప్రయాణించిన క్రమంలో చైనా దీనిపై అభ్యంతరం తెలిపింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు