అమ్మ మధురం
అమ్మ నవ్వు మధురం
అమ్మ మాట మధురం
అమ్మ పాట మధురం
అమ్మ నవ్వు చూపింది
జగతి జాలాన్ని
అమ్మ మాట చాటింది
బతుకు లౌక్యాన్ని
అమ్మ పాట లాలించింది
అనిర్వచనీయ విషాద హృదయాన్ని
వీటన్నింటినీ
శిల్పించి రూపునిస్తుంది అమ్మ భాష
అమ్మ భాషకీ పిన్నమ్మ భాషకీ
ఆత్మ ఒక్కటే
వాటి పరమార్థమొక్కటే
అయినా
పిన్నమ్మయినా పెద్దమ్మయినా
అమ్మ తర్వాతేగా…
అందుకే
అమ్మ మూలం ప్రతి మనిషికీ
అమ్మ భాష మూలం ప్రతి ఒక్కరికీ
– కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ