Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆదర్శ గ్రీన్ పార్కులో చలివేంద్రం ఏర్పాటు..

ఆదర్శ గ్రీన్ పార్కులో చలివేంద్రం ఏర్పాటు..


విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పీఆర్టీ వీధిలో గల ఆదర్శ గ్రీన్ పార్కులో ఆదర్శ సేవా సంఘం ఆధ్వర్యంలో మినరల్ వాటర్ తో చలివేంద్రమును ముఖ్య అతిథులుగా విచ్చేసిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు హిందీ పండిట్ వేణుగోపాలచార్యులు, రోటరీ క్లబ్ ప్రతినిధి నరేందర్ రెడ్డి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు చిన్న తంబి చిన్నప్ప, కార్యదర్శి మంజునాథ్, ఆదర్శ సేవా సంఘం అధ్యక్షులు భీమిశెట్టి కృష్ణమూర్తి, గౌరవ అధ్యక్షులు చెన్న ప్రకాష్, కార్యదర్శి గుద్దుతూ నాగార్జునల ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈ చలివేంద్రమును ఏర్పాటు చేయడం ఆనందదాయకమని తెలిపారు
నేడు పట్టణంలో ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రజల దాహార్తి తీర్చేందుకు, చక్కటి ఆరోగ్యాన్ని మినరల్ వాటర్ ద్వారా పొందేందుకు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం, మారుతి కుమార్, నాగరాజు, శ్రీనివాస్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు