కోస్తా తీర జలాల్లో ఇసుక తవ్వకం వాతావరణానికి సంబంధించిందే కాదు, ఆర్థిక విషయానికి సంబంధించింది కూడా. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలపై అక్కడి పాలకులు, ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ దురాక్రమణ అని కూడా ప్రజలు ప్రతిఘటిస్తారు.
కె.రవీంద్రన్
ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల కోస్తా తీర ప్రాంతాల జలాల్లో ఇసుక తవ్వడానికి ప్రయత్నిస్తున్నందున బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు మధ్య ఘర్షణ రేకెత్తే అవకాశాలున్నాయి. ఈ ఘర్షణ కేవలం వాతావరణ, ఆర్థిక అంశాలకు సంబంధించినవి మాత్రమే కాదు, ఇండియా భౌగోళిక, ఎన్నికలకు సంబంధం గలవి కూడా అవుతాయి. ఇందుకు సంబంధించిన జాతులు ఈ సమస్యను లేవనెత్తుతాయి. హిందీ రాష్ట్రాల కీలక ప్రాంతాలలోని కోస్తాలో బీజేపీకి చారిత్రకంగా తక్కువ ప్రదేశాలలో ఇసుక తవ్వకాలకు అవకాశం ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ప్రతిపక్షాలకు అధిక పలుకుబడి ఉంది. ఇప్పుడు తీర ప్రాంత జలాల్లో ఇసుక తవ్వకాలపై చర్చలు జరుగుతున్నాయి. అధికారం, పరిపాలనకు సంబంధించి ఆర్థిక విధాన నిర్ణయంపైన చర్చలు సాగుతున్నాయి.
బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాలు ఒకదానికొకటి కలిసి ఉంటాయి. ఈ రాష్ట్రాల్లో కోస్తా తీర ప్రాంతంలో జీవనాధారాలు అనుసంధానమై ఉంటాయి. అయితే కోస్తా తీరం భారీగా ఉన్న రాష్ట్రాలు` పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో రాజకీయ నాయకత్వం కోస్తా ప్రాంతంలో నివసించే జనాభా పైన భారీగా నిధులు ఖర్చు చేస్తాయి. ఈ రాష్ట్రాలు సంప్రదాయంగా బీజేపీ అనసరించే హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ప్రస్తుత ఈ ఘర్షణ వెనుక వైరుధ్య స్వభావం కలిగి ఉంది. కోస్తా తీర జలాల్లో ఇసుక తవ్వకం వాతావరణానికి సంబంధించిందే కాదు, ఆర్థిక విషయానికి సంబంధించింది కూడా. ప్రతిపక్షాలు పాలించే రాష్ట్రాలపై అక్కడి పాలకులు, ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని ప్రకటిస్తారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వ దురాక్రమణ అని కూడా ప్రజలు ప్రతిఘటిస్తారు.
మత్స్యకారుల ఆందోళన:
కోస్తా తీర జలాల్లో ఇసుక తవ్వినట్లైతే అందరి కంటే ముందుగా మత్స్యకారులు తీవ్ర ఆందోళన చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తీర జలాల్లో చేపలు పట్టుకొని జీవించటం పెరగటం వల్ల వాతావరణ మార్పు, ప్రతికూల ప్రభావం పెరిగింది. దీనిపై ఆందోళనా వ్యక్తమవుతోంది. జలాల్లో ఇసుక తవ్వినట్లైతే మత్స్యకారుల జీవన భృతికి తీవ్ర ముప్పు కలుగుతుంది. అప్పుడు వీరు ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తప్పనిసరిగా ఆందోళనకు దిగుతారు. కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చినట్లైతే అది తమ జీవన భృతికి మరో ముప్పు అవుతుందని ఆందోళన పడతారు. కేరళలోని కోస్తా తీరంలో మత్స్యకారులు తమ జీవన భృతికి ఇసుక తవ్వకం తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఇప్పటికే ఆందోళనకు పూనుకున్నారు. తమ జీవన భృతి లేకుండా ప్రభుత్వం చేస్తోందని మత్స్యకారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక తవ్వకం జరిగినట్లైతే తీర ప్రాంతం కోసుకు పోతుందని, సముద్రం వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, తీర వైవిధ్యం ధ్వంసం అవుతుందని, ఇవన్నీ నేరుగా మత్స్యకారులపై ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. సముద్రంపై జీవించే వేలాది కుటుంబాల జీవితాలు నాశనమవుతాయన్నది వాస్తవం.
ఈ అంశంపై శాస్త్రీయ అధ్యయనం, సర్వేలు కేరళ కోస్తా తీరంలో జరుగుతున్నాయి. మత్స్యకారులు, ప్రజలు ఆందోళన చెందటంలో న్యాయం ఉంది. సముద్రంలో భిన్న విధాలుగా తీర జీవనం పగడాల దిబ్బలు, సముద్రంలో గడ్డి కయ్యలు వివిధ రకాల పక్షులు, జీవులు ధ్వంసం అవుతాయి. ఇవన్నీ వాతావరణ సమతుల్యాన్ని కాపాడతాయి. సున్నితమైన మట్టి నిర్మాణం తీర వాతావరణ వ్యవస్థకు భారీగా ప్రమాదం కలుగుతుంది. సముద్ర జలాల్లో ఇసుక తవ్వినట్లైతే జలాల్లోని మడ్డిగా ఉండే మట్టి చెల్లాచెదరై పోతుంది. ఈ మడ్డి అంతా సుదూర ప్రాంతాలకు కొట్టుకు పోతుంది. సముద్రంలో ఉండే పగడాల దిబ్బలు ఇప్పటికే చాలా దెబ్బతిన్నాయి. అలాగే నీటి స్వచ్ఛత దెబ్బతింటుంది. సముద్ర జలాల్లో ఇసుక తవ్వకం కోస్తా తీర రక్షణపై దీర్ఘకాలిక ప్రభావం ఉంటుంది. క్రమంగా ఇసుక కోస్తా తీరాలకు చేరటం మూలంగా సముద్ర జలాలు స్థాయి పెరుగుతుంది. తద్వారా తుపాన్లు వచ్చే ప్రమాదం ఉంది. సముద్ర జలాల నుంచి ఇసుకను తోడేయటం వల్ల తీర ప్రాంతాల కోత పెరుగుతుంది. సముద్ర జలాలకు కొద్ది దూరంలో నివసించే ప్రజలు ఎల్లవేళలా ముప్పుకు గురవుతారు. అలాగే వాతావరణ పరిస్థితులు ఎక్కువగా మారిపోతుంటాయి. ఈ పరిస్థితులను కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా అనుభవిస్తుంటాయి. దీర్ఘకాలికంగా వాతావరణం దెబ్బతినడానికి, సామాజిక సుస్థిరతకు తక్కువ కాలం ఆర్థిక ప్రయోజనాల కోసం ఇసుక తవ్వకం విధానం సరైంది కాదని వాతావరణ నిపుణులు విమర్శిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత జలాల్లో ఇసుక తవ్వకాన్ని ప్రతిపాదించటం వాస్తవంగా తీవ్రమైన సమస్య రాజకీయ ఆందోళనలకు దారి తీస్తుంది. కోస్తా రాష్ట్రాలు ఎక్కువగా ప్రతిపక్ష పార్టీల పాలనలో ఉన్నాయి. అన్ని రాష్ట్రాలను ప్రత్యేకించి ప్రతిపక్ష రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం ఏకపక్ష నిర్ణయం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని పార్లమెంటులో ఆమోదించినట్లైతే ప్రతిపక్ష రాష్ట్రాలలో తీవ్ర ఆందోళన తలెత్తుతుంది. అయితే తీర ప్రాంత సముద్ర జలాల్లో ఇసుక తవ్వకపోతే నిర్మాణానికి అవసరమైన ముడి వస్తువులు డిమాండ్‌ను తట్టుకోలేమని అందువల్ల తవ్వడం సరైందని కేంద్రం వాదిస్తోంది. వేగంగా పట్టణీకరణ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా మౌలిక నిర్మాణాల అభివృద్ధి జరుగుతోంది. అందువల్ల ఇసుక డిమాండు ఆకాశాన్ని అంటుతోంది. దీనివల్ల అక్రమంగా కూడా సముద్ర జలాల్లో ఇసుక తవ్వకం చోటు చేసుకుంటోంది. సముద్ర జలాల్లో ఇసుక తవ్వకానికి కేంద్రం చట్టబద్దమైన అధికారం కలిగి ఉన్నదని ప్రభుత్వం చెబుతోంది.