Tuesday, March 4, 2025
Homeఅంతర్జాతీయంఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత

ఉక్రెయిన్‌కు సైనిక సాయం నిలిపివేత

వాషింగ్టన్‌/మాస్కో: రష్యా`ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని ఆపేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు కానీ ఆయన పగ్గాలు చేపట్టిన తర్వాత రెండు దేశాల మధ్య బంధం బలహీనమైంది. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికా పర్యటనతో ఈ విషయం బహిర్గతమైంది. శ్వేతసౌధం వేదికగా మీడియా ఎదుట జెలెన్‌స్కీ, ట్రంప్‌ మధ్య వాగ్వాదంతో వారి మధ్య అభిప్రాయ భేదాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఉక్రెయిన్‌ తలొగ్గాలని అమెరికా పట్టుబట్టింది… కానీ ఉక్రెయిన్‌ ఒప్పుకోలేదు. దీంతో పరిస్థితి మరింత జఠిలంగా మారింది. ట్రంప్‌ అక్కసుతో ఉక్రెయిన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేశారు. దీంతో కీవ్‌ మరింత ఇరకాటంలో పడిరది. రష్యాతో రాజీ కుదుర్చుకొనేలా ఆ దేశంపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు రష్యాకు అమెరికా అనుకూలమని తాజా చర్యలతో స్పష్టమవుతోంది. శాంతికి కట్టుబడి ఉన్నామని… తమ సహాయం వల్ల ఈ సమస్యకు పరిష్కారం ఎంత మేరకు జరగలదో నిర్థారించుకోవడం కోసమే సైనిక సాయాన్ని నిలిపివేసినట్లు చెప్పుకున్నారు. రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని చేసుకోకుండా జెలెన్‌స్కీ ఎక్కువ కాలం వెళ్లదీయలేరని ట్రంప్‌ అన్నారు. ఈ మేరకు శ్వేతసౌధం అధికారి ఒక ప్రకటనలో వెల్లడిరచారు.
స్వాగతిస్తున్నాం: రష్యా
ఉక్రెయిన్‌కు సైనిక సహాయాన్ని అమెరికా నిలిపివేయడంపై రష్యా హర్షం వ్యక్తం చేసింది. ఇక శాంతిని ఆశించవచ్చు అని క్రెమ్లిన్‌ మంగళవారం ఓ ప్రకటన చేసింది. అమెరికా నిర్ణయాన్ని పూర్తిగా అధ్యయనం చేయాల్సిన ఉందని క్రెమ్లిన్‌ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కో అన్నారు. ‘ఇది నిజంగా జరిగితే… శాంతి ఒప్పందం దిశగా ఉక్రెయిన్‌ను ప్రోత్సహించినట్టే! ఈ యుద్ధానికి ఇప్పటివరకు ప్రధాన సరఫరాదారుగా అమెరికా ఉంది. ఇప్పుడు సాయాన్ని ఆపేసింది. అంటే శాంతి నెలకొల్పేందుకు అద్భుత తోడ్పాటు అందించింది’ అని పెస్కోవ్‌ అన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి స్ధాపనను ఆకాంక్షిస్తూ ట్రంప్‌ చేసిన ప్రకటనలను తాము స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడిరచారు.
మమ్మల్ని లొంగలదీసుకునేందుకే: ఉక్రెయిన్‌
తమ దేశానికి అమెరికా సైనిక సహాయాన్ని నిలిపివేయడాన్ని ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండిరచింది. తమ దేశం రష్యాకు లొంగిపోయేలా చేయాలన్నదే ట్రంప్‌ ప్రభుత్వ ఉద్దేశమని దుయ్యబట్టింది. ఈ మేరకు ఉక్రెయిన్‌ పార్లమెంటరీ విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ మెరెజ్‌కో ఆరోపించారు. కీవ్‌పై ఒత్తిడి తేవడానికే ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని యూరప్‌ దుయ్యబట్టింది. అమెరికా సాయం లేకుండా రష్యాతో ఉక్రెయిన్‌ పోరాడలేదని యూరప్‌ నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. ట్రంప్‌ ప్రకటన వెలువడిన అనంతరం వీరు అత్యవసరంగా సమావేశం అయ్యారు. ఉక్రెయిన్‌ పరిస్థితిపై చర్చించారు. జర్మనీ కొత్త చాన్సలర్‌ ఫ్రెడరిక్‌ మెర్జ్‌ కూడా అమెరికా తీరును ఖండిరచారు. ఉక్రెయిన్‌ను బలహీనపరిచేందుకు ట్రంప్‌ ఉద్దేశపూర్వకంగా ఈ చర్యకు పూనుకున్నారని విమర్శించారు. మరోవైపు జెలెన్‌స్కీ లండన్‌లో నిర్వహించిన యూరప్‌ దేశాధినేతల సమావేశంలో మాట్లాడుతూ అమెరికాతో ఖనిజాల ఒప్పందానికి సిద్ధమని ప్రకటించారు. రష్యాతో యుద్ధం ముగియాలంటే ఇంకా చాలా కాలం పడుతుందని, ఇది ఇప్పట్లో జరిగేది కాదని చెప్పారు. యుద్ధం ముగిసేంత వరకు అమెరికా తమకు అండగా నిలుస్తుందని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు