
- జెన్‌జీని భయపెట్టలేరు
- రోషన్ కుమార్ సిన్హా, నెల్లికంటి సత్యం
- ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలు ప్రారంభం
- భారీ ప్రదర్శన, బహిరంగ సభ
విశాలాంధ్ర – యాదాద్రి: దేశానికి భవిష్యత్తుగా చెప్పకునే యువతకు ఉద్యోగాలు, నాణ్యమైన విద్య, సామాజిక భద్రత కల్పించడంలో విఫల మైన మోదీ ప్రభుత్వం… ప్రశ్నించే యువ తనే దిమాగీ నకస్ల్స్గా ముద్ర వేయడం దుర్మార్గమని, ఇలాంటి గిమ్మిక్కుల ద్వారా తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్ సిన్హా విమర్శించారు. ఏఐవైఎఫ్ 3వ రాష్ట్ర మహాసభల సందర్భంగా యాదగిరిగుట్టలోని లక్ష్మీ నర్సింహా ఫంక్షన్ హాల్ నుండి బస్టాండ్ వరకు జెండాలు చేతబూని, విద్య, వైద్య, ఉపాధి హక్కుల సాధనకై పోరాడదామని, ఇంకిÇలాబ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ భారీ ఎత్తున యువజన ప్రదర్శన మంగళవారం జరిగింది. అనంతరం బహిరంగ బహిరంగసభకు ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ అధ్యక్షత వహించారు. ఏఐవైఎఫ్ యాదాద్రి జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్ వక్తలకు స్వాగతం పలికారు. రోషన్ కుమార్ సిన్హా మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉద్యోగాలు, అభివృద్ధి, అచ్చేదిన్ పేరుతో యువతలో ఆశలు రేకెత్తించిన కేంద్ర ప్రభుత్వం… 12 ఏళ్ల తర్వాత కూడా కోట్లాది యువతకు స్థిరమైన ఉపాధి కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు, పేపర్ లీకులు, నియామకాల్లో జాప్యం, ప్రైవేటీకరణ, కాంట్రాకీట్కరణ వంటి సమస్యలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తున్నాయని అన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జెన్‌జీ యువత విద్య, పరీక్షలు, ఉద్యోగాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి అంశాలపై పెద్ద ఎత్తున ప్రశ్నలు లేవనెత్తిన నేపథ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన ప్రధాని మోదీ దిమాగీ నకస్ల్స్ అంటూ విమర్శకులపై ముద్ర వేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. ‘ఉద్యోగం కావాలని అడిగే యువకుడు దిమాగీ నకస్ల్ కాదు. పేపర్ లీక్ ఎందుకు జరిగిందంటే దేశద్రోహి కాదు. నా భవిష్యత్తు ఏమి{ని నిలదీసే జెన్-జీని అణచివేయలేరు’ అని ఆయన అన్నారు. జెన్ జీ యువజన ఉద్యమాలు కేవలం సోషల్ మీడియా హడావుడి కాదని, విద్యా వ్యవస్థ, పరీక్షల విశ్వసనీయత, ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ జవాబుదారీతనం వంటి వాస్తవ సమస్యల నుంచి పుట్టుకొస్తున్నాయన్నారు. యువత ప్రశ్నిస్తే దేశం బలహీనపడదని, ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నిరుద్యోగం వ్యక్తిగత సమస్య కాదని, అది ప్రభుత్వ విధానాల ఫలితంగా ఏర్పడిన సామాజిక సమస్య అని గుర్తించి యువత సంఘటితం కావాలని ఏఐవైఎఫ్ పిలుపునిస్తుందన్నారు. ప్రతి జిల్లాలో ఉద్యోగ హక్కు కమిటీలు ఏర్పాటు చేసి… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, ప్రతి శాఖకు ఖాళీల భర్తీకి కాలపరిమితితో కూడిన ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను అడ్డుకుని రైల్వేలు, బ్యాంకులు, రక్షణ, విద్య, వైద్యం, రవాణా, పరిశ్రమల్లో భారీగా శాశ్వత ఉద్యోగాలు సృష్టించాలని డిమాండ్ చేశారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో సర్టిఫికెట్లు కాదు, స్కిల్‌కు తగిన ఉద్యోగాలు కావాలన్నారు. యువత తమ వ్యక్తిగత నిరుద్యోగ బాధను సామూహిక హక్కుల పోరాటంగా మార్చుకుని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో సంఘటితమై పోరాడాలని పిలుపునిస్తూ యాదగిరిగుట్ట నుంచి కొత్త తరపు యువజన ఉద్యమానికి నూతన దిశను ప్రకటిస్తుందన్నారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటాన్ని నేటి తరం చూడకపోవచ్చు, పాల్గొనకపోవచ్చు కానీ 2026లో దేశ రాజధాని దిల్లీలో జరిగిన పోరాటం మరో స్వాతంత్ర్య పోరాటాన్ని తలపించిందని, 56 అంగుళాల ఛాతీతో 12 సంవత్సరాలుగా విశ్వగురువు అని విర్రవీగిన ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారిగా విద్యార్థులు, యువత పోరాటానికి దిగివచ్చారని, ఇది 60 కోట్ల యువత ఆక్రందన పోరాట ఉద్యమ విజయమన్నారు. బహిరంగ సభలో ఏఐవైఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి సుఖ్జిందర్ మహేశ్వరి, ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నానబాల రామకృష్ణ, లింగం రవి, తీర్పారి వెంకటేశ్వర్లు, కునుకుంట్ల శంకర్, టి.సత్య ప్రసాద్, శ్రీమాన్, యుగంధర్, చేపూరి కొండల్, సీపీఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు బొలగాని సత్యనారాయణ, చెడే చంద్రయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు గోద శ్రీరాములు, సీపీఐ, ఏఐవైఎఫ్ నాయకులు కళ్లెం కృష్ణ, బండి జంగమ్మ, కొల్లూరి రాజయ్య, ఉప్పల ముత్యాలు, కుసుమని హరిచంద్ర, ఎండీ నహీం, బద్దుల శ్రీనివాస్, శేఖర్‌రెడ్డి, బెల్లి శ్రీకాంత్, సుద్దాల సాయికుమార్, సునీల్ కుమార్, కల్లేపల్లి మహేందర్, బబ్బూరి శ్రీధర్, పేరబోయిన పెంటయ్య, బంగారు, గోపగాని రాజు, ప్రణయ్, కంబాల వెంకటేష్, రాష్ట్రం నలుమూýల నుండి వేలాదిమంది యువజన కార్యకర్తలు పాల్గొన్నారు.


