Friday, April 4, 2025
Homeఉద్యోగులకు శుభవార్త

ఉద్యోగులకు శుభవార్త

రూ.6,200 కోట్ల బకాయిల విడుదల
జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ చెల్లింపులు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పెండిరగ్‌ బకాయిల్లో రూ.6,2 00 కోట్లు విడుదల చేసింది. ఇటీవల సీఎం చంద్రబాబు ఆర్థికశాఖ అధికారుల తో సమావేశం నిర్వహించి… ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల బకాయిల విడుదలపై దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి ఉద్యోగుల ఖాతాల్లోకి నిధులు జమయ్యేలా ఆర్థికశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ రుణాలు, తుది చెల్లింపులు, పెన్షనర్లకు సంబంధించిన గ్రాట్యుటీ, జీఏఐఎస్‌, సీపీఎస్‌ ఉద్యోగుల మ్యాచింగ్‌ గ్రాంట్లు, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు జమకానున్నాయి. బకాయిలకు సంబంధించి రూ.6,200 కోట్లను నేరుగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుతానికి ఏపీజీఎల్‌ఐ రుణాలు, తుది చెల్లింపులు ఉద్యోగుల ఖాతాల్లో జమవుతున్నట్లు తెలిసింది. ఈనెల 26వ తేదీ సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమయ్యేలా ఆర్థికశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… జనవరిలోనూ రూ.1100 కోట్ల బకాయిలను ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించిన విషయం విదితమే. ప్రస్తుతం రూ.6,200 కోట్ల బకాయిలు విడుదల చేయగా… ఆ మొత్తం కలిపి రూ.7,300 కోట్ల బకాయిలు విడుదల చేసినట్లయింది. ఇంకా ఉద్యోగులకు సంబంధించి పెండిరగ్‌ బకాయిలు రూ.23 వేల కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంది. బకాయిల విడుదలను స్వాగతిస్తున్నామని, మిగిలిన ఉద్యోగ, ఉపాధ్యాయ బకాయిలు విడుదలకు ప్రణాళిక ఎప్పుడు రూపొందిస్తారని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, రఘునాథ్‌రెడ్డి ప్రశ్నించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం 12వ పీఆర్సీ చైర్మన్‌ను తక్షణమే నియమించాలని కోరారు. కొంత మేరకు బకాయిల విడుదలపై ఏపీ ఎన్జీఓ అసోసియేషన్‌ నేతలు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బకాయిలు విడుదల చేసిన చంద్రబాబు ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన మిగిలిన పెండిరగ్‌ బకాయిలు విడుదల చేయాలని, 12వ పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలన్న డిమాండ్లు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల పరిష్కారం కోసం ఫిబ్రవరి 2వ తేదీన ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం విదితమే.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు