Tuesday, May 27, 2025
Homeవ్యాపారంఉస్మానియాలో హెల్ప్‌లైన్‌, రోగి సహాయక సేవలు ప్రారంభం

ఉస్మానియాలో హెల్ప్‌లైన్‌, రోగి సహాయక సేవలు ప్రారంభం

విశాలాంధ్ర/హైదరాబాద్‌ : ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో రోగుల కోసం 24/7 ప్రత్యేక హెల్ప్‌లైన్‌, రోగి సహాయక సేవలను హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ రాకేష్‌ సహాయ్‌ సమక్షంలో బీఎస్బీ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ ప్రతినిధి సల్మాన్‌ బాబు ఖాన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సేవలతో రోగులకు తక్షణ సహాయం, మార్గనిర్దేశం అందుతుందన్నారు. మా లక్ష్యం ప్రజా ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడమన్నారు. ఆ దిశగా ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు హెల్పింగ్‌ హ్యాండ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరంలో 15 ప్రభుత్వ హాస్పిటల్స్‌ లో 80 పైగా కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్ల సాయంతో సేవలు అందించనున్నామని చెప్పారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు