పల్లవి:
ఎగరేసిన ఎర్రజెండా చరితరా
సురవరం
మనదేశపు అరుణారుణ కాంతిరా
సుధాకరం
ఎల్లలు లేని జెండా ఎత్తినవాడు
ప్రాణం పోయేవరకు దించనివాడు
లాల్ సలాం లాల్ సలాం అందుకో
సృజనశీలి
లాల్ సలాం లాల్ సలాం
పోరు దండమందుకో
త్యాగశీలి
చరణం:
నీ స్వరమే భాస్వరం
నీ పలుకే చైతన్యం
నీ పిలుపే ప్రభంజనం
నీ అడుగే నీరాజనం
నువ్వు నడిచిన మార్గాన
పీడిత జన విప్లవం
ఎనలేని ఉద్యమాల
మార్గదర్శివి
ఎర్రజెండా జాతీయ
కార్యదర్శివి
చరణం 2
నీ అడుగే సంచలనం
నీ మౌనమే ఓ యుద్ధం
నీ చెలిమే సిద్ధాంతం
నీ తోడే మాకు బలం
నువ్వు చూపిన ఎర్రబాట
సదా మాకు ఆచరణం
ఎన్నుకున్న సిద్ధాంతపు
వెన్నుపూసవి
ఎర్ర ఎర్రని వనంలో
వెలుగు రేఖవి
చరణం 3
నీ మరణం ఓ జననం
నీ దూరం సమీపం
నీ గమనం గతి తర్కం
నువ్వు ఎగిరిన పతాకం
నువ్వు నింగిన అరుణతార
జ్వలించే అగ్నిధార
అధ్యయనపు ఆలోచన
అగ్రగామివి
శిఖరాగ్రం నిలిచిన
సింధూరానివి
దేవరకొండ శ్రీనివాస్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు
ఎగరేసినఎర్రజెండా చరితరా
- Advertisement -


