Friday, February 21, 2025
Homeవిశ్లేషణఎన్నికల్లోబీహార్‌, బెంగాల్‌ ఎటువైపు ?

ఎన్నికల్లోబీహార్‌, బెంగాల్‌ ఎటువైపు ?

అరుణ్‌ శ్రీ వత్సవ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తీవ్రమైన దెబ్బతగలడంతో ఆ పార్టీ ప్రధాన నాయకుడు రాహుల్‌ గాంధీ ముందు జాగ్రత్త పడుతున్నారు. ఈ సంవత్సరం చివరికి బీహార్‌, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. బీహార్‌లో ఆర్‌జేడీతో కలిసి కాంగ్రెస్‌ పోటీ చేస్తుంది. అంతేకాదు, ఇండియా ఐక్యసంఘటనలో భాగస్వాములైన వామపక్షాలు, ఇతర చిన్నపార్టీలు కూడా కలిసి పోటీచేసే అవకాశం ఉంది. దిల్లీలో కూడా కాంగ్రెస్‌ అభ్యర్థులు పోటీచేసిన నియోజకవర్గాలలో దళితులు పెద్దగా ఓట్లు వేయలేదు. ఈ నేపధ్యంలో తదుపరి ఎన్నికల్లో ఇండియా ఐక్యసంఘటనతో కలిసి పోటీచేసి ఎలాగైనా గెలవడానికి తీవ్రంగా రాహుల్‌ ఆలోచిస్తున్నారు. బీహార్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ బాధ్యులను త్వరలో నిర్ణయించాలని భావిస్తున్నారు. బిహార్‌లో ప్రస్తుతం కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడుగాఉన్న అఖిలేష్‌ సింగ్‌ను తప్పించి మరో నాయకుడుని నియమించాలని నిర్ణయించారు. అఖిలేష్‌ సింగ్‌ దళిత నాయకుడు. మరో 15రోజుల్లో ఈ నాయకుడుని మార్చి కొత్త వ్యక్తిని ప్రకటించనున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేసేందుకు సిద్ధమవుతోంది. బీహార్‌లో పార్టీ పనివిధానాన్ని పూర్తిగా మార్పుచేయాలని రాహుల్‌ ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ఎంపీ తారిఫ్‌ అన్వర్‌కు సంబంధించిన స్పష్టతకోసం రాహుల్‌ వేచి చూస్తున్నారు. అంతేకాదు, ఆ రాష్ట్రంలో అనుసరించవలసిన వ్యూహాన్ని రచించనున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నాయకుడు తీవ్రమైన అనుభవాన్ని చవిచూశారు. ఆర్‌జేడీ ప్రధాన నాయకుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ కాంగ్రెస్‌ కోరిన నాలుగు సీట్లను తిరస్కరించారు. తమ పార్టీ తరఫున నలుగురు అంతగా తెలియని అభ్యర్థులను పోటీ చేయించారు. ఈ నలుగురు ఓటమి పాలయ్యారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ బలంగానేఉంది. కాంగ్రెస్‌కు ఆ నాలుగు సీట్లను కేటాయించి ఉన్నట్లయితే ఆ నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బ తగిలేదికాదని అంచనావేశారు. ఈ సంవత్సరం ఆఖరుకు బీహార్‌ అసెంబ్లీకి ఎన్నిక జరుగుతుంది.
ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్‌ కోరినవిధంగా లాలూప్రసాద్‌ యాదవ్‌ అంగీకరించి ఉన్నట్లయితే ఇండియా ఐక్యసంఘటనకు మరో నాలుగు సీట్లు వచ్చిఉండేవని సీపీఐ (ఎంఎల్‌) నాయకులు సైతం భావించారు. 2020లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70సీట్లు కేటాయించగా, కేవలం 19సీట్లు మాత్రమే కాంగ్రెస్‌ గెలిచింది. అంతక్రితం అసెంబ్లీలో ఉన్న సీట్లకంటే కాంగ్రెస్‌కు 8సీట్లు తగ్గాయి. సీపీఐ (ఎంఎల్‌) 19సీట్లకు పోటీచేసి 12సీట్లు గెలుచుకుంది. సీపీఐ, సీపీఎంలు చెరో రెండుసీట్లు గెలుచుకున్నాయి. బీహార్‌ పీసీసీ అధ్యక్షుడు కనీసం దళితులు, ఓబీసీలు, ఈబీకేలు, ముస్లింలను గత ఎన్నికల్లో కనీసం కలుసుకోలేకపోయారు. అన్వర్‌ కూడా పార్టీ నిర్మాణస్వరూపంలో ఎంతమాత్రం మార్పు తీసుకోలేకపోయారు. ఆ మార్పులు ఇప్పుడు ఎంతైనా అవసరం. చౌ చౌగా మార్పుల చేయడంగాక, మౌలికంగా పూర్తిగా పార్టీలో మార్పులు తీసుకురావలసిన అవసరం ఎంతైనాఉంది. బీహార్‌లో ఇతర పార్టీలతో పొత్తుపెట్టుకుని పోటీచేయడం సాధ్యంకాకపోతే ఒంటరిగా పోటీచేయాలన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మధ్య తరగతి కులాలు, ఉన్నత కులాల ప్రజలు మళ్లీ కాంగ్రెస్‌వైపు రావాలని చూస్తున్నారు. అయితే కొన్నిచోట్ల కాంగ్రెస్‌పట్ల సందేహాలు కలిగిఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌ను బ్రాహ్మణులు, భూమిహారులు నిర్వహిస్తున్నారు. వాస్తవంగా ఈ రెండు కులాలు బీజేపీతో కలిసిఉన్నారు. ఈ కులాలకు చెందిన నాయకులే కాంగ్రెస్‌ను నడుపుతున్నారు. ఈ కులాలకు చెందిన నాయకులు ఉన్నప్పటికీ ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఇండియా ఐక్యసంఘటన బలహీనంగా ఉందన్న విషయం బహిరంగ రహస్యమే.
ఇండియా ఐక్యసంఘటన బలమైన వాణిని వినిపించే స్థితిలోలేదు. బీహార్‌లో లాలూ ఆధారంగానే ఇండియా ఐక్యసంఘటన నిలిచిఉంది. రెండు నెలల క్రితమే ఇండియా బ్లాక్‌ అధ్యక్షురాలిగా తాను పనిచేస్తానని మమత బెనర్జీ చెప్పారు. ఆ విషయాన్ని కాంగ్రెస్‌ నాయకులు ప్రస్తావిస్తున్నారు. జాతీయస్థాయిలో రాహుల్‌గాంధీ ఇండియా బ్లాక్‌ తరఫున పనిచేయడానికి చొరవ తీసుకోవడంలేదని మమత బెనర్జీ ఆరోపించారు. బీహార్‌లోనూ ఇదే పద్ధతిని అవలంబించవచ్చుకదా అని ఆరోపిస్తున్నారు. అయితే లాలూ, తేజస్విలు బీహార్‌లో ఇండియాబ్లాక్‌లో ఉన్న పార్టీలను కలుపుకుని బలోపేతం చేసేందుకు లాలూ, తేజస్విలు చేసినదేమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇండియాబ్లాక్‌లో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్‌ నాయకులు తరచుగా జాతీయస్థాయిలో సభలు, సమావేశాలు జరపలేదని ఆరోపిస్తుండగా, బీహార్‌ స్థాయిలో ఆర్‌జేడీ నాయకులు కూడా తరచూ సమావేశాలు ఏర్పాటు చేయలేదని ఆరోపిస్తున్నారు. తేజస్వి కేవలం తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు ర్యాలీలు, యాత్రలు జరుపుతున్నారని కొంతమంది నాయకులు విమర్శిస్తున్నారు. బీహార్‌ కాంగ్రెస్‌ యూనిట్‌ చాలా బలహీనంగాఉందని రాహుల్‌ ఆందోళన చెందుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన ముందుజాగ్రత్త పడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు