Tuesday, March 4, 2025
Homeతెలంగాణఎమ్మెల్యేలపై అనర్హత కేసులో తెలంగాణ ప్రభుత్వానికిసుప్రీం నోటీసులు

ఎమ్మెల్యేలపై అనర్హత కేసులో తెలంగాణ ప్రభుత్వానికిసుప్రీం నోటీసులు

విశాలాంధ్ర-హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోరుతూ బీఆర్‌ఎస్‌ దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై నిర్ణయానికి ఎంత సమయం కావాలో స్పీకర్‌కు తెలపాలని గత విచారణప్పుడు ఆదేశించింది. కౌంటర్లు దాఖలు చేయడానికి ఎలాంటి నోటీసులు రాలేదని, సాంకేతికంగా ఇది గమనించాల్సిన విషయమని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ అగస్టిన్‌ మాహిస్‌ జార్జ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి తరపున న్యాయవాదులు తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం, అసెంబ్లీ స్పీకర్‌, కార్యదర్శి, 10 మంది ఎమ్మెల్యేలు, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులను కోర్టు జారీచేసింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి ఈనెల 22వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంతకుముందు అనర్హత పిటిషన్లపై స్పీకర్‌ నిర్ణయం తీసుకునేందుకు రీజనబుల్‌ టైమ్‌ అంటే ఎప్పటివరకు? ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలి? ఎంత సమయం కావాలి? చెప్పండి అని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఆపరేషన్‌ సక్సెస్‌, పేషంట్‌ డెడ్‌’ అన్నట్లుగా వ్యవహరించడం సరికాదని సూచించింది. బీఆర్‌ఎస్‌ తరపున సీనియర్‌ న్యాయవాది అర్యమ సుందరం వాదనలు వినిపించారు. అనర్హత పిటిషన్లపై నిర్ణయంలో ఉద్దేశపూర్వక జాప్యం జరుగుతోందని, స్పీకర్‌ నిర్ణయం తీసుకోకపోవడమంటే రాజ్యంగబద్ధ విధులను నిర్వహించడంలో విఫలమైనట్లేనని వ్యాఖ్యానించారు. వాదనల అనంతరం తదుపరి విచారణ 25వ తేదీకి వాయిదా పడిరది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు