Homeతెలంగాణ‘ఎమ్మెల్యేల చోరీ’పై రాహుల్‌ సిగ్గుపడాలి

‘ఎమ్మెల్యేల చోరీ’పై రాహుల్‌ సిగ్గుపడాలి

- Advertisement -

‘ఓట్‌ చోరీ’ కంటే ఇది దారుణం: కేటీఆర్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : జాతీయ స్థాయిలో ‘‘ఓటు చోరీ’’ పై నీతులు చెబుతున్న రాహుల్‌ గాంధీ, తెలంగాణలో జరుగుతున్న ‘‘ఎమ్మెల్యేల చోరీ’’ గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఇది రాహుల్‌ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తుతున్న ఓటు చోరీ కంటే దారుణమైన నేరం అని ఆయన మండిపడ్డారు. ఇలాంటి అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియలో భాగస్వామి అయినందుకు రాహుల్‌ తల దించుకోవాలన్నారు. బీఆర్‌ఎస్‌ టికెట్లపై గెలిచి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు, ఇప్పుడు తాము పార్టీ మారలేదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బహిరంగంగా, నిసిగ్గుగా జరుగుతున్న ఫిరాయింపు రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ భాగస్వామ్యాన్ని చూసి సిగ్గుపడాలని కేటీఆర్‌ విమర్శించారు. పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను రాహుల్‌ గాంధీతో సహా అనేక మంది కాంగ్రెస్‌ నేతలు స్వయంగా కలిసి, వారితో దిగిన ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారని కేటీఆర్‌ గుర్తు చేశారు.
‘‘ఇవాళ వీళ్లను మీరు గుర్తుపట్టగలరా’’ అంటూ ఆ ఫొటోలను చూపిస్తూ ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్‌ టికెట్‌ మీద గెలిచి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు మేము కాంగ్రెస్‌లో చేరలేదు అని చెప్పడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు. ఓటు చోరీ గురించి రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలకంటే, ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని వ్యాఖ్యానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు