విశాలాంధ్ర/కడప: భారతదేశంలోని 6 వేదికలలో 517 మంది అభ్యర్థులు పాల్గొనగా ‘అతిపెద్ద పశువుల సంక్షేమ పాఠం (బహుళ వేదికలు)’ కోసం ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సాధించడం ద్వారా చరిత్ర సృష్టించిందని సంస్థ ప్రతినిధులకు ప్రకటన తెలిపారు. భారతదేశంలో, గ్రామీణ ప్రాంత జనాభాలో దాదాపు 65-70 శాతం మంది తమ జీవనోపాధి కోసం వ్యవసాయం లేదా వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలపై ఆధారపడుతున్నారన్నారు. అందువల్ల, వారి జీవనోపాధి ఉత్పత్తి కార్యకలాపాలు ఆర్థిక శ్రేయస్సులో పశువులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఈ విడదీయరాని బంధాన్ని గుర్తించి, ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ 7వ ఎడిషన్ పశు వికాస్ దినోత్సవాన్ని ‘‘మేరా పశు మేరా పరివార్’’ అనే నేపథ్యంతో జరుపుకుందని స్పష్టం చేశారు. ఇది ఈ గ్రామీణ కుటుంబాల జీవితాల్లో పశువుల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిందన్నారు. ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ శంతను మిత్రా, ఎస్‌ఎంఎఫ్‌జీ ఇండియా క్రెడిట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ స్వామినాథన్ సుబ్రమణియన్ మాట్లాడుతూ ‘పశు వికాస్ దినోత్సవాన్ని వరల్డ్ రికార్డ్స్ యూనియన్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, బెస్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్స్ వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ కూడా గుర్తించాయన్నారు.