అమెరికాకు చైనా హెచ్చరిక ` సుంకాలపై వెనక్కి తగ్గమని సూచన
బీజింగ్: తమ దేశంపై రెట్టింపు సుంకాలను అమలు చేయబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రకటించడాన్ని చైనా తీవ్రంగా ఖండిరచింది. ఏకపక్ష నిర్ణయాలు వద్దని సూచించింది. దీని వల్ల తమ మధ్య సంప్రదింపులకు విఘాతం కలగవచ్చని హెచ్చరించింది. ఫెంటనైల్ సంబంధిత వ్యవహారాల నెపంతో చైనా నుంచి దిగుమతి చేసుకునేవాటిపై అదనంగా 10శాతం సుంకం విధిస్తామని అమెరికా బెదిరిస్తోందని చైనా వాణిజ్య శాఖ (ఎంఓసీ) శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టింది. అమెరికా తీరు మార్చుకోకుంటే చైనా ప్రతిఘటిస్తుందని తేల్చిచెప్పింది. తమ న్యాయపరమైన హక్కులు, ప్రయోజనాలకు విఘాతం కలగనివ్వబోమని ఎంఓసీ ప్రతినిధి వెల్లడిరచారు. ఏకపక్షంగా అదనపు సుంకాలు విధించడమంటే డబ్ల్యూటీఓ నిబంధనలను అతిక్రమించడమేనని, బహుపక్ష వాణిజ్య వ్యవస్థను తక్కువ చేసినట్లు అవుతుందని చైనా అనేకసార్లు చెప్పిందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణకు అత్యంత కఠినమైన విధానాలు కలిగిన దేశాల్లో చైనా ఒకటి కాగా అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణకు అమెరికాతో కలిసి పనిచేస్తున్నట్లు చెప్పారు. తమ దేశాన్ని అమెరికా పదేపదే ఎందుకు విస్మరిస్తోందని ప్రశ్నించారు. తమ ఉత్పత్తులపై అదనంగా 10 శాతం సుంకాలు విధిస్తామని బెదిరిస్తోందని, దీనివల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్తవి పుట్టుకొస్తాయని హెచ్చరించారు. అంతేకాకుండా ప్రపంచ సరఫరా గొలుసుల అస్థిరమవుతాయని, అమెరికా వ్యాపారాలు, వినియోగదారులపై భారం పెరగవచ్చన్నారు. ఇలాంటి తప్పిదం మళ్లీ జరగదని, అమెరికా త్వరలోనే సన్మార్గాన్ని అనుసరిస్తుందని, చర్చలు జరిపి మనస్పర్థలు తొలగించుకునేందుకు ప్రయత్నిస్తుందని చైనా ఆశిస్తున్నట్లు అధికార ప్రతినిధి వెల్లడిరచారు.