Wednesday, May 28, 2025
Homeవ్యాపారంఐక్యూ నుండి ఐక్యూ నియో10 లాంచ్‌

ఐక్యూ నుండి ఐక్యూ నియో10 లాంచ్‌

విశాలాంధ్ర/హైదరాబాద్‌ : హై పెర్ఫార్మెన్స్‌ స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌ ఐక్యూ తన లేటెస్ట్‌ పవర్‌ హౌస్‌ ఐక్యూ నియో 10ను లాంచ్‌ చేసింది. యువ నిపుణుల నుండి భారీ-పనితీరు వినియోగదారుల వరకు యువత కోసం ఇది రూపొందింది. దాని మార్గదర్శక డ్యూయల్‌-చిప్‌ ఆర్కిటెక్చర్‌, మెరుగైన శీతలీకరణ వ్యవస్థ, మొదటి ఆవిష్కరణలతో ఈ విభాగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేస్తుంది. ఐక్యూ నియో10 భారతదేశపు మొట్టమొదటి స్నాప్డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌ 4 చిప్‌సెట్‌తో వస్తుంది. శక్తివంతమైన 7000 ఎంఏహెచ్‌ బ్యాటరీని స్లిమ్‌ డిజైన్‌లో ఏకీకృతం చేస్తుంది. ఐక్యూ నియో10 8ం128జీబీ వేరియంట్‌ ధర రూ.31,999, 8ం256 వేరియంట్‌ ధర రూ.33,999, 12ం256జీబీ వేరియంట్‌ ధర రూ. 35,999, 16ం512జీబీ వేరియంట్‌ ధర రూ.40,999. ఇది ఇన్ఫెర్నో రెడ్‌, టైటానియం క్రోమ్‌ అనే రెండు రంగులలో లభిస్తుంది. అదనంగా, ఐక్యూ నియో 10 సోమవారం నుండి ప్రీ-బుకింగ్‌ కోసం అందుబాటులో ఉంది. జూన్‌ 3, మధ్యాహ్నం 12 గంటల నుండి ఐక్యూ ఈస్టోర్‌, అమెజాన్‌.ఇన్‌లో అమ్మకం ప్రారంభమవుతుంది. ఐక్యూ నియో 10ను ప్రీ-బుక్‌ చేసుకునే కస్టమర్లు ఉచిత ఐక్యూ టీడబ్ల్యుఎస్‌ 1ఈని అందుకుంటారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు