ముంబయిః ఐటీసీ హోటల్స్ లిమిటెడ్ మార్చి 31, 2025తో ముగిసిన త్రైమాసికం, సంవత్సరానికి స్వతంత్ర ఆర్థిక ఫలితాలు విడుదల చేసింది. అధిక పనితీరు నమోదయింది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా ఆదాయం, లాభాలు కన్పించాయి. క్యూ4 ఎఫ్‌వై25లో అద్భుతమైన పనితీరు కన్పించింది. ఆదాయం 17% పెరిగి రూ.1017 కోట్లు నమోదు కాగా, ఈబీఐటీడీఏ మార్జిన్ 350 బీపీఎస్, ప్యాట్ 44% పెరిగి రూ.264 కోట్లుగా 40%కి విస్తరించింది. పూర్తి సంవత్సరం ఆదాయం రూ.3333 కోట్లు, ప్యాట్ రూ.698 కోట్లు. గత 24 నెలల్లో 54 ఒప్పందాలు, 30 హోటల్ ప్రారంభాలు జరగడంతో బ్రాండ్ల మధ్య బలమైన పైప్‌లైన్ ఏర్పడిరది. ఐటీసీ లిమిటెడ్ హోటల్స్ వ్యాపారం జనవరి 1, 2025 నుండి ఐటీసీహోటల్స్ లిమిటెడ్‌లో విడదీయబడిరది. కంపెనీ ఈక్విటీ షేర్లు జనవరి 29, 2025న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బీఎస్‌ఈ లిమిటెడ్‌లో విజయవంతంగా జాబితా చేయబడ్డాయి.