న్యూదిల్లీ: యుజ్వేంద్ర చాహల్.. ఈ పేరు వింటేనే టీమిండియా ప్లేయర్లకు ఎంతో ఉత్సాహం వచ్చేది. ప్లేయర్లకే కాదు.. అభిమానులు సైతం చాహల్ ఫన్నీ స్పంట్స్, చిలిపి చేష్టలను ఎంతో ఇష్టపడేవాళ్లు. మైదానంలో వికెట్లు తీస్తూ సందడి చేసే చాహల్ చాలా కాలంగా కనిపించ లేదు. ఇక ఈ ఐపీఎల్ 2026తో మళ్లీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ఐపీఎల్ సీజన్ కోసం తన జీవన విధానంలో అనేక మార్పులు చేసుకున్నట్లు చాహల్ తెలిపాడు. దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న చాహల్, గత ఆరు నెలలుగా తాను మద్యానికి పూర్తిగా దూరంగా ఉంటున్నట్లు వెల్లడించాడు. 35 ఏళ్ల వయసులో ఫిట్నెస్, బౌలింగ్‌పై మరింత దృష్టి సారించి… జట్టు కోసం తన శాయశక్తులా కృషి చేయాలనే పట్టుదలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు.


