Homeఒక్కటైన 10 వామపక్షాలు

ఒక్కటైన 10 వామపక్షాలు

- Advertisement -

. నేపాల్‌లో ఏకీకృత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం
. సమన్వయకర్తలుగా ప్రచండ, నేపాల్‌ ఏకగ్రీవం

ఖాట్మండు: నేపాల్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 10 వామపక్ష పార్టీలన్నీ ఒక్కటయ్యాయి. సీపీఎన్‌ (మావోయిస్టు సెంటర్‌), సీపీఎన్‌ (ఏకీకృత సోషలిస్టు), నేపాల్‌ సోషలిస్ట్‌ పార్టీ, సీపీఎన్‌ (సోషలిస్ట్‌), జన సమాజ్‌వాదీ పార్టీ, నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ (మావోయిస్ట్‌`సోషలిస్ట్‌), సీపీఎన్‌ (సమాజ్‌వాదీ)తో పాటు వామపక్ష పార్టీలన్నీ కలిసి ఐక్య పార్టీ ఏర్పాటునకు అంగీకారం తెలిపాయి. దీనికి సంబంధించి 18 అంశాల ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీంతో నేపాలీ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించింది. ఏకీకృత పార్టీ సమన్వయకర్తలుగా పుష్ప కమల్‌ దహల్‌ (ప్రచండ), మాధవ్‌ కుమార్‌ నేపాల్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజధాని ఖాట్మండులోని భ్రికుతి మండప్‌లో బుధవారం జరిగిన జాతీయ ఐక్యతా సమావేశంలో భాగంగా వీరి ఎన్నిక జరిగింది. ఇదే కార్యక్రమంలో ఏకీకృత నేపాలీ కమ్యూనిస్టు పార్టీని అధికారికంగా ప్రకటించారు. మేనిఫెస్టోను ఆమోదించారు. కేంద్ర కమిటీని ఎన్నుకున్నారు. పార్టీ నిర్మాణంపై తుది నిర్ణయం మరో ఆరు నెలల్లో జరగబోయే జాతీయ ఐక్యతా సదస్సులో జరగనున్నట్లు నాయకులు ప్రకటించారు. కాగా, నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీలో కేంద్ర కమిటీ, రాజకీయ కమిటీ, కార్యదర్శి వర్గం, కార్యనిర్వాహక సమన్వయ కమిటీ ఉంటాయని ఒప్పందం తెలిపింది. నూతన పార్టీకి మార్క్సిజం`లెనినిజం సిద్ధాంతాలే మార్గదర్శకం కాగా శాస్త్రీయ సోషలిజం కోసం ఇది పనిచేస్తుంది. నేపాల్‌కు అనుగుణమైన రాజకీయ కార్యక్రమాన్ని రూపొందించుకోనున్నది. ప్రజాస్వామిక విప్లవాల ద్వారా సాధించిన లక్ష్యాల పరిరక్షణకు నేపాల్‌ కమ్యూనిస్టు పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుందని ఒప్పందం పేర్కొంది. సోషలిజం విస్తరణకు క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు సృష్టించడంపై దృష్టి కేంద్రీకరిస్తుందని వెల్లడిరచింది. అలాగే, ప్రజా ఉద్యమాలు శాంతియుతంగా జరుపుకోవడం, అవసరమైన రంగాలతో పాటు వీధి పోరాటాలు, పార్లమెంటులో పోరాటాలు సాగించడం కోసం కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొంది. నేపాల్‌ సోషలిస్టు విప్లవ లక్ష్యాల సాధన కోసం కమ్యూనిస్టు ఉద్యమం ఏకీకరణ చారిత్రక అవసరమని ఒప్పందం నొక్కిచెప్పింది. సమాజాన్ని శాస్త్రీయ సోషలిజం వైపు నడిపించేందుకు కృషి చేయాలని నిర్ణయించింది. అదే విధంగా సమాఖ్య ప్రజాస్వామ్యం, గణతంత్రం, జాతీయ సార్వభౌమాధికారం, సుపరిపాలన, సామాజిక న్యాయం, ఆర్థికాభివృద్ధి సాధకు నేపాలీ కమ్యూనిస్టు పార్టీ సంకల్పించింది. తమ ఎన్నికల చిహ్నంగా నక్షత్రాన్ని ఎంపిక చేసుకున్నది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు