Wednesday, February 26, 2025
Homeఆంధ్రప్రదేశ్ఒక్క రోజులోనే రూ. 1.91 ల‌క్ష‌ల కోట్లు కోల్పోయిన ఎలాన్‌ మ‌స్క్‌

ఒక్క రోజులోనే రూ. 1.91 ల‌క్ష‌ల కోట్లు కోల్పోయిన ఎలాన్‌ మ‌స్క్‌

స్పేస్ఎక్స్‌, టెస్లా సీఈఓ, ప్ర‌పంచ కుబేరుడు ఎలాన్ మ‌స్క్ సంప‌ద మంగ‌ళ‌వారం నాడు భారీగా ఆవిరైంది. నిన్న ఒక్క‌రోజే ఆయ‌న‌ ఏకంగా రూ. 1.91 ల‌క్ష‌ల కోట్లు కోల్పోయారు. వ‌రుస‌గా నాలుగో రోజు కూడా టెస్లా షేర్లు ప‌త‌నం కావ‌డ‌మే ఇందుకు కార‌ణం. యూర‌ప్‌లో టెస్లా కార్ల అమ్మ‌కాలు 45 శాతం మేర క్షీణించాయి. యూర‌ప్‌లో మొత్తం ఎల‌క్ట్రిక్ వాహ‌నాల విక్ర‌యాలు పెరిగినప్పటికీ, టెస్లా కార్ల అమ్మ‌కాలు త‌గ్గడం అనేది మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బ‌తీసింది. ఈ నేప‌థ్యంలో న్యూయార్క్ లో టెస్లా షేర్లు నిన్న ఒక్క‌రోజే 8.4 శాతం క్షీణించ‌డంతో కంపెనీ విలువ 1 ట్రిలియ‌న్ డాల‌ర్ల దిగువ‌కు పడిపోయింది. గ‌తేడాది నవంబ‌ర్ 7 త‌ర్వాత ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి. ఇక మ‌స్క్ సంప‌ద స‌గానికి పైగా టెస్లాలోనే ఉన్న విష‌యం తెలిసిందే. ఒక్క‌సారిగా టెస్లా షేర్లు క్షీణించ‌డంతో ఆయ‌న సంప‌ద ఏకంగా 22.2 బిలియ‌న్ డాల‌ర్లు (రూ. 1.91 ల‌క్ష‌ల కోట్లు) ఆవిరైంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు