Tuesday, May 13, 2025
Homeవ్యాపారంఒప్పో ఎఫ్‌29 సిరీస్‌ అమ్మకాల వృద్ధి 28%

ఒప్పో ఎఫ్‌29 సిరీస్‌ అమ్మకాల వృద్ధి 28%

ముంబయి : ఒప్పో ఇండియా కొత్తగా విడుదల చేసిన ఎఫ్‌29 సిరీస్‌ అద్భుతంగా విజయంతమైందని కంపెనీ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌లో మొదటి 21 రోజుల అమ్మకాల కాలంలో, ఎఫ్‌29 సిరీస్‌ ఒప్పో ఎఫ్‌ 27 ప్రో ప్లస్‌ కంటే 28% అమ్మకాల వృద్ధిని సాధించింది. ఇది ఈ ప్రాంతంలో దాని పెరుగుతున్న ప్రజాదరణ, బలమైన డిమాండ్‌ను నొక్కి చెబుతుంది. ఒప్పో ఎఫ్‌29 సిరీస్‌ను భారతదేశం కోసం, కఠినమైన సవాళ్లను అధిగమించేలా తయారు చేశారు. ఒప్పో ఎఫ్‌29 సిరీస్‌ భారతదేశ పెరుగుతున్న గిగ్‌ ఎకానమీని దృష్టిలో ఉంచుకుని తయారు చేశారు. డ్రైవర్లు, డెలివరీ భాగస్వాములు, హోం-సర్వీస్‌ నిపుణులు, చిన్న వ్యాపార యజమానులకు ఇది తోడుగా ఉంటుంది. మిలిటరీ-గ్రేడ్‌ దృఢత్వం, అధునాతన కనెక్టివిటీ, దీర్ఘకాలిక బ్యాటరీ శక్తిని కలిపి, ఎఫ్‌29 సిరీస్‌ సన్నని, స్టైలిష్‌ డిజైన్‌లో ఏదైనా సవాలును స్వీకరించేలా తయారు చేశారు. ఒప్పో ఎఫ్‌29 సిరీస్‌ నెట్‌వర్క్‌ కనెక్టివిటీలో కూడా కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్‌ చేసిందని, పరీక్ష ఆధారంగా జియో ధృవీకరించింది. ఈ సిరీస్‌ రూ.20 వేలు- 30 వేలు ధరల విభాగంలో నెట్‌వర్క్‌ కోసం ఉత్తమ పరికరాల్లో ఒకటిగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు