Saturday, February 22, 2025
Homeహైదరాబాద్కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయి

కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు రెండు పార్టీలు ఒకటయ్యాయి

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : పట్టభద్రుల్లారా జాగ్రత్త కాంగ్రెస్‌ అభ్యర్ధిని ఓడిరచడానికి బీజేపీ బిఆర్‌ఎస్‌ ఒక్కటయ్యాయని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ – బిఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం చేసుకున్నా యని టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. పార్లమెంట్‌ ఎన్ని కల్లో వలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బిఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు ఇస్తుందని విమర్శించారు. బుధవారం కామారెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పాల్గొని ప్రసంగించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి దేవుడు పేరు చెప్పి ఓట్లు దండుకోవడం బీజేపీ పార్టీకి పరిపాటిగా మారిందని దుయ్యబ ట్టారు. సోషల్‌ మీడియాను వేదికగా చేసుకొని బీజేపీ, బిఆర్‌ఎస్‌ అసత్యాలను ప్రచారం చేస్తున్నా యని పేర్కొన్నారు. బీజేపీ, బిఆర్‌ఎస్‌ కుట్రను తిప్పికొట్టి కాంగ్రెస్‌ అభ్యర్ధి నరేందర్‌ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధిని ఆదరించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్లలో 50 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్‌ ఏడాదిలోనే 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిం దన్నారు. ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని హామీ ఇస్తున్నామని, ట్యూషన్ల నుంచి మొదలైన పార్టీ అభ్యర్ధి నరేందర్‌ రెడ్డి ప్రయాణం విద్యాసంస్థలు నెలకొల్పి వేలమందిని విద్యావంతులను తయారు చేసిన వ్యక్తి అంటూ కొనియాడారు. నరేందర్‌ రెడ్డిని గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల కోసం కృషి చేస్తారని, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను కాంగ్రెస్‌ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంద న్నారు. గ్రాడ్యుయేట్‌ పరిధిలోని నలుగురు బీజేపీ ఎంపీలు ఉండి, బడ్జెట్‌లో రాష్ట్రానికి తెచ్చిన నిధులు గుండు సున్నా అంటూ ఎద్దేవాచేశారు. బడ్జెట్‌లో రూపాయి తీసుకోరాని బీజేపీ ఎంపీలను నిలదీయాల న్నారు. నరేందర్‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వంతో చర్చించి పట్ట భద్రుల సమస్యల కోసం కృషి చేస్తారన్నారు. విద్యావేత్తగా నరేందర్‌ రెడ్డికి నాలుగు ఉమ్మడి (ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌) జిల్లాలపై అవగాహన ఉందని, బీజేపీ అభ్యర్థికి ఇక్కడి పట్టభద్రుల సమస్యలపై అవగాహన లేదన్నారు. బీసీలకు ఇచ్చిన మాటకు కట్టుబడి రాహుల్‌ గాంధీ ఆశయం మేరకు కులగణన సర్వే నిర్వహించామని, బీసీల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు