Homeక్రీడలుకివీస్‌కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు

కివీస్‌కు ‘సూపర్-8’ బెర్త్ ఖరారు

- Advertisement -

కెనడాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం

చెన్నై: టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్డి నుంచి న్యూజిలాండ్ సూపర్-8 దశలోకి ప్రవేశించింది. మంగళవారం కెనడాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సూపర్8 బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర ఆకాశమే హద్దుగా చెలరేగడంతో కివీస్ సునాయాసంగా గెలుపొందింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెనడా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ యువరాజ్ సమ్రా (65 బంతుల్లో 110) అద్భుత సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించాడు. అతనికి కెప్టెన్ దిల్‌ప్రీత్ బాజ్వా (36) నుంచి మంచి సహకారం లభించడంతో కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. 30 పరుగులకే టిమ్ సీఫెర్ట్ (6), ఫిన్ అలెన్ (21) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గ్లెన్ ఫిలిప్స్ (36 బంతుల్లో 76 నాటౌట్), రచిన్ రవీంద్ర (39 బంతుల్లో 59 నాటౌట్) కెనడా బౌలర్లపై విరుచుకుపడ్డారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 146 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో న్యూజిలాండ్ కేవలం 15.1 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంతో కివీస్ జట్టు గ్రూప్-డి నుంచి సూపర్-8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి ఇప్పటికే దక్షిణాఫ్రికా సూపర్-8 చేరడం విదితమే. అఫ్గానిస్థాన్, యూఏఈ, కెనడా ఎలిమినేట్ అయ్యాయి.
టోర్నీలో ఇప్పటివరకు ఆతిథ్య జట్లు టీమిండియా, శ్రీలంకతో పాటు వెస్టిండీస్, ఇంగ్లండ్ కూడా సూపర్-8 బెర్తులు ఖాయం చేసుకున్నాయి. గ్రూప్-ఏలో పాకిస్థాన్.. గ్రూప్-బిలో ఆస్ట్రేలియా… ఈ రెండు జట్ల సూపర్-8 అవకాశాలు ఇతర జట్ల ప్రదర్శనపై ఆధారపడి ఉన్నాయి.

సౌతాఫ్రికా x యూఏఈ
ఉదయం 11 గంటలకు
పాకిస్తాన్ x నమీబియా
మద్యాహ్నం 3 గంటలకు

ఇండియా x నెదర్లండ్
రాత్రి 7 గంటలకు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు