Monday, March 3, 2025
Homeవ్యాపారంకేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీకి గ్రీన్‌ ఉర్జా అండ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

కేఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీకి గ్రీన్‌ ఉర్జా అండ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు

హైదరాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ, ఇంధన సామర్థ్యం పరంగా చేసిన అత్యుత్తమ కృషికి గానూ కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీ గుర్తింపు పొందింది, 5వ గ్రీన్‌ ఉర్జా అండ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డ్స్‌ 2024లో ప్రతిష్టాత్మకమైన ‘ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఎక్సలెన్స్‌ అవార్డు-అకాడెమియా’ను అందుకుంది. కోల్‌కతాలోని ఇండియన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసిసి), నాలెడ్జ్‌ పార్టనర్‌గా డెలాయిట్‌ భాగస్వామ్యంతో నిర్వహించిన కార్యక్రమంలో పొందిన ఈ అవార్డు పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణ పట్ల విశ్వవిద్యాలయం నిబద్ధతను ప్రదర్శిస్తుంది. గ్రీన్‌ ఉర్జా అండ్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డులు సస్టెయినబల్‌ ఇంధన భవిష్యత్తు వైపు నడిపించే సంస్థలు, వ్యక్తులను సత్కరిస్తాయి. న్యూఢల్లీిలోని లీ మెరిడియన్‌లో జరిగిన ఈ వేడుకలో, పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ఏకీకృతం చేయడం, విద్యారంగంలో ఇంధన పరిరక్షణను ప్రోత్సహించడంలో దాని మార్గదర్శక ప్రయత్నాలకు కెఎల్‌ డీమ్డ్‌ టు బి యూనివర్సిటీని గుర్తించింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు