. దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖాగుప్తా ప్రమాణం
. మంత్రులుగా మరో ఆరుగురు
. ప్రధాని మోదీ సహా ప్రముఖుల హాజరు
న్యూదిల్లీ:
బీజేపీ నాయకురాలు, 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్తా… దిల్లీ రాష్ట్ర తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం మధ్యాహ్నం, రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రివర్గం, ఎన్డీఏ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్‌నాథ్ షిండే- అజిత్ పవార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా రేఖా గుప్తాతో పాటు మరో ఆరుగురు పర్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజిత్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్ చేత మంత్రులుగా ప్రమాణం చేయించారు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా. బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్, కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్, ఆప్ నుంచి ఆతిశి తర్వాత దిల్లీ పీఠాన్ని అధిరోహించిన నాలుగో మహిళగా నిలిచారు రేఖా గుప్తా. ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో రేఖ ఒక్కరే మహిళా సీఎం! అంతేకాదు మమతా బెనర్జీ (పశ్చిమ బెంగాల్) తర్వాత దేశంలో రెండో ముఖ్యమంత్రిగా రేఖ గుర్తింపు తెచ్చుకున్నారు.
సీఎం వద్దే ఆర్థిక, హోంశాఖ
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిసేపటికే రేఖాగుప్తా మంత్రులకు శాఖల్ని కేటాయించారు. కీలమైన హోంశాఖ, ఆర్థికశాఖలను తనవద్దే అట్టిపెట్టుకున్నారు. మంత్రుల శాఖల వివరాలు ఇలా:
స్త్ర రేఖా గుప్తా (ముఖ్యమంత్రి) (షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే) – హోం, ఆర్థిక, సేవలు, నిఘా, ప్రణాళిక శాఖ.
స్త్ర పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ (ఉప ముఖ్యమంత్రి) (న్యూదిల్లీ ఎమ్మెల్యే) – విద్య, ప్రజాపనులు, రవాణా శాఖ.
స్త్ర మంజీందర్ సింగ్ సిర్సా (రాజౌరీ గార్డెన్ ఎమ్మెల్యే) – ఆరోగ్యం, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ.
స్త్ర రవీంద్ర కుమార్ ఇంద్రాజ్ (భావన ఎమ్మెల్యే) – సాంఘిక సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ వ్యవహారాలు, కార్మిక శాఖ. కపిల్ మిశ్రా (కారవాల్ నగర్ ఎమ్మెల్యే) – నీరు, పర్యాటక, సాంస్కృ తిక శాఖ. ఆశిష్ సూద్ (జనకపురి ఎమ్మెల్యే) – రెవెన్యూ, పర్యావరణం, ఆహారం మరియు పౌర సరఫరాల శాఖ. పంకజ్ కుమార్ సింగ్ (వికాస్ పురి ఎమ్మెల్యే) – చట్టం, శాసనసభ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ.
మహిళలకు నెలకు రూ.2,500
ప్రమాణస్వీకారం చేసిన అనంతరం రేఖాగుప్తా సచివాలయానికి వెళ్లారు. ఆ సమయంలో రేఖా గుప్తా వెంట దిల్లీ బీజేపీ ఇంఛార్జ్ బైజయంత్ పండా, అధ్య క్షుడు వీరేంద్ర సచ్‌దేవా సహా అనేకమంది పార్టీ నాయకులు ఉన్నారు. ‘వికసిత్ దిల్లీ’ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు తమ ప్రభుత్వం ఒక్క రోజు కూడా వృథా చేయదని సీఎం రేఖా గుప్తా తెలిపారు. కాగా ప్రజలకు ఇచ్చిన అన్ని వాగ్దానా లను తాము నెరవేరుస్తామని సీఎంగా ్నపమాణ స్వీకారం చేయకముందే ఆమె చెప్పారు. బీజేపీ హామీ ఇచ్చినట్లు… మహిళా సంవృద్ధి యోజన తొలి విడతలో భాగంగా నెలకు రూ.2500ని మార్చ్ 8లోగా మహిళల బ్యాంక్‌ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడిరచారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను నెరవేర్చడం రాజ ధానిలోని 48 మంది బీజేపీ ఎమ్మెల్యే లందరి బాధ్యత. మహిళలకు ఆర్థిక సహాయం సహా మా అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తాం. మార్చి 8 నాటికి మహిళలందరి ఖాతాల్లో 100 శాతం డబ్బులు జమ అవుతాయి’’ అని రేఖా గుప్తా తెలిపారు. 2025 దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే, మహిళలకు నెలకు రూ. 2100 ఇస్తామని ఆమ్? ఆద్మీ పార్టీ మెనిఫెస్టోలో చెప్పగా.. తాము నెలకు రూ. 2,500 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాదు, ప్రతి గర్భిణీకి రూ. 21వేలు ఇస్తామని, ఎల్పీజీ సిలిండర్‌పై రూ. 500 సబ్సిడీ ఇస్తామని, హోలీ- దీపావళికి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తామని హామీల వర్షం కురుపించింది. ప్రజలు భారీ మెజా రిటీతో గెలిపించడంతో ఈ హామీలను నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉంది.